How to retain youth a study

How to retain youth a study at atomic level, Retaining youth called Kayakalpa, Ancient Rishis Kayakalpa, Telomeres and Enzyme telomerase

How to retain youth a study at atomic level

కలకాలం యవ్వనంగా ఉండటం ఎలా?

Posted: 05/05/2014 03:27 PM IST
How to retain youth a study

యవ్వన దశ చిగురించిన తర్వాత దానికో కాల పరిమితి ఉంది.  ఆతర్వాత యవ్వనం తరిగిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది.  చిరుప్రాయంలో బాధ్యతలు, ఒత్తిడిలు లేకుండా హాయిగా తిరిగినా ఆ దశను ఎవరూ మళ్ళీ కోరుకోరు.  అందుకు కారణం ఆ దశలో యవ్వనకాలపు సంతృప్తి కాని, జీవించటానికి ఆర్థికంగా సామాజికంగా స్వేచ్ఛ కాని ఉండదు.  కానీ యవ్వనం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు.  ఎలాంటివాళ్ళయినా యవ్వనం చిగురుతొడిగే సమయంలో అందాన్ని సంతరించుకుంటారు.  అదే అందం వృద్ధాప్యం మొదలవగానే తరగిపోవటం మొదలవుతుంది.  అప్పుడే దాన్ని అట్టే పెట్టుకోవాలనే ఆశ, ఆత్రుత మనుషులలో మొదలవుతాయి.  జుట్టుకి రంగు రాసినా, చర్మం ముడతలు పడకుండా క్రీములు రాసినా, శరీరంలోని పటుత్వం తగ్గిపోతుంటే తమలోని ఆకర్షణను పెంచుకోవాలనుకోవటమే కాకుండా శృంగారంలో కూడా సమర్థతను తిరిగి సంపాదించాలనుకుంటారు.  కానీ కృత్రిమంగా ఏం చేసినా జీవితాన్ని కొనసాగించినట్లుగా యవ్వన దశను కొనసాగించటం అసాధ్యమని తెలిసిపోతుంది.  

అందుకే కాయకల్ప విద్య మీద పూర్వకాలం ఋషులు, ఔషధాలను తయారు చేసే వారు కూడా పరిశోధనలు చేసారు.  కానీ వారి జీవితకాలం కూడా దానికి సరిపోలేదు.  మనిషి ఎల్లకాలం యవ్వనంగా ఉండే మార్గాన్ని అన్వేషించలేకపోయారు.

ఈమధ్యకాలంలో సైంటిస్ట్ లు యవ్వనరహస్యాలను ఛేదించటం కోసం అణు స్థాయిలో పరిశోధనలు మొదలుపెట్టి, ఎంజైమ్ టెలోమెరేస్ ని శోధించే ప్రయత్నం చేస్తున్నారు.  వయసు సడలిపోవటం, క్యాన్సర్ కలిగించటం అనే వాటితో సంబంధమున్న ఎంజైమ్ టెలోమెరేస్, టెలిమియర్స్ నిగూఢమైన పరిశీలనలోకి వచ్చాయి.  టెలోమియర్స్ అనేవి మన క్రోమోజోమ్స్ కి చివర్లో పొడుగ్గా పెరిగిన మన డిఎన్ యే కి చెందిన వివరాలను నిక్షిప్తం చేసుకుని ఉంటాయి.  బహుశా అందులోనే కణవిభజనకు సంబంధించిన వివరాలుంటాయి కాబట్టి వాటి ద్వారా కణాలు గుణాన్ని పోగొట్టుకుని క్యాన్సర్ గా మారటం, వయసు ఉడిగిపోవటం గురించిన రహస్యాలను బయటకు తీసుకునిరావాలని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.      

క్రోమోజోమ్స్ చివర్లలో ఉండే టెలిమియర్స్ ని షూ లేస్ చివర్లతో పోల్చవచ్చు.  అవి క్రోమోజోమ్స్ నశించకుండా, ఒకదానితో మరొకటి కలిసి పోకుండా, అందులోని నిక్షిప్తమైవున్న డేటాకు నష్టం వాటిల్లకుండా చూస్తాయి.  జీవకణ విభజన జరిగినప్పుడల్లా టెలిమియర్స్ నిడివి తగ్గిపోతుంటుంది.  టెలిమియర్స్ మరీ చిన్నగా అయినప్పుడు జీవకణం పనిచెయ్యటం ఆగిపోతుంది, దానితో అది చచ్చిపోతుంది.  అయితే టెలిమియర్స్ నిడివి విషయంలో మనిషికీ మనిషికీ తేడావుంటుంది.  కాబట్టి, టెలిమియర్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవటంతో డిఎన్ఏ లో ఉండే జీవకణానికి సంబంధించిన డేటా భద్రంగా ఉంటుందని, అది చాలా ముఖ్యమని అరిజోనా స్టేట్ యూనిర్సిటీ ప్రొఫెసర్ జూలియన్ చెన్ అన్నారు.  

టెలిమియర్స్ క్షీణించటం మనిషిలో వివిధ రకాల వ్యాధులకు ఆస్కారం లభిస్తుందని చెన్ అన్నారు.  

అంటే ఆరోగ్యాన్ని యవ్వనాన్ని కాపాడుకునే దిశలో మొదటి మెట్టయిన దాని మూలాన్ని కనుక్కోవటం జరిగింది కానీ దాన్ని కాపాడుకోవటం ఎలా అన్నది ఇంకా అర్థం కాలేదు.  అయితే మొదటిసారిగా దీన్ని అణుస్థాయిలో పరిశోధించవచ్చన్నది మాత్రం తెలిసిందని చెన్ తన సంతోషాన్ని వ్యక్తపరచారు.  

నేచర్ స్ట్రక్చరల్ అండ్ మోలిక్యులర్ బయోలజీ అనే మ్యాగజైన్ లో ఈ పరిశీలనను ప్రచురించటం జరిగింది.  

వ్యాధి నివారణ, వ్యాధి నిర్మూలన, వయసు మళ్ళటం ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడివున్నాయని అర్థం చేసుకున్న మన పూర్వీకులు యోగాభ్యాసాల ద్వారా యవ్వనాన్ని, జీవితకాలాన్ని పొడిగించుకోగలిగారు కానీ శాశ్వతంగా ఉంచుకునే ఉపాయాన్ని వాళ్ళూ మానవాళికి ఇవ్వలేకపోయారు.  చూద్దాం ఈ కాలపు శాస్త్రజ్ఞులు ఎంతవరకు సాధిస్తారో!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles