Last day for election campaign

Last day for election campaign, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Last day for election campaign

చెవిలో కట్టుకున్న ఇళ్ళు ఇక ఖాళీ

Posted: 05/05/2014 10:11 AM IST
Last day for election campaign

చెవిలో ఇళ్ళు కట్టకుని మాకే వోటెయ్యండి, మేమిది చేసాం, ఇంకా ఇది చేస్తాం, ప్రతిపక్షాల మాటను నమ్మకండి, వాళ్ళు మోసగాళ్ళు, మేమే నికార్సయినవాళ్ళం, మంచి వాళ్ళం, అంటూ ఊదరగొడుతూ వస్తున్న పార్టీలకు ఈ రోజు అందుకు ఆఖరిరోజవటంతో అన్ని పార్టీల నాయకులు ఈరోజు శ్రమకోర్చి ముమ్మర ప్రచారానికి దిగుతున్నారు  

తెలంగాణాను కత్తిరించిన తర్వాత మిగిలిన రాష్ట్రంలో ఏడవ తేదీన రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటల సమయాన్ని వోటరుకివ్వాలి కాబట్టి ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజవుతోంది.

కేంద్రంలో ఎన్డియేకి, రాష్ట్రంలో తెదేపాకి వోటేసి అభివృద్ధిని సాధించమంటూ భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సీమాంధ్రలో విస్తృతంగా పర్యటించి వోటర్లను ఆకట్టుకున్నారు.  అలాగే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేలన పార్ఠీ అధ్యక్షడు పవన్ ఖల్యాణ్ కలిసి ఆ స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూ అది దొంగలపార్టీయని, దానికి ఓటేస్తే వచ్చేది దొంగల రాజ్యమేనంటూ విమర్శలను గుప్పించారు.  మరో పక్క హిందూపురం నుంచి పోటీచేస్తున్న బాలకృష్ణ, చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా దూకుడు పెంచి భాజపా తెదేపా కూటమికి వోటు వేసి గెలిపించవలసిన ఆవశ్యకతను గురించి మాట్లాడారు.

రాష్ట్ర విభజన గురించి ఆ సమయంలో ఏమీ మాట్లాడని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఒక్క సారి మాత్రం గుంటూరు, హిందుపురం లలో ప్రచారానికి వచ్చారు.  కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రథసారధి చిరంజీవి, ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ, భాజపా తెదేపా కూటమి కూడా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా విమర్శలు చెయ్యట విశేషం.  సీమాంధ్ర ప్యాకేజ్ లను గురించి వివరిస్తూ జైరాం రమేశ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేసారు.  

వైయస్ జగన్, విజయమ్మ, షర్మిలలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  కానీ డబ్బు కుమ్మరించటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్లుగా కనపడుతోంది.  పాత పథకాల గురించి, తను అధికారంలోకి వస్తే కొత్తగా జగన్ తాను చెయ్యబోతున్న ప్రజాప్రయోజనాలను ఏకరువు పెడుతున్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, డబ్బు మద్యం పంపిణీలలో పట్టుబడటం జరిగింది.  డబ్బు పంపిణీలలో దొంగనోట్లు కూడా ఉన్నాయి.  

ఇక సిపిఐ ఎమ్ తో పొత్తు పెట్టుకున్న జైసమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విస్తతంగా ప్రచారం చేసారు.  

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అవినీతి రహితమైన ప్రభుత్వం కోసం తగిన పార్టీకే పట్టంకట్టాలని పిలుపునిచ్చారు.  సినీ దర్శకుడు రాజమౌళి లోక్ సత్తా తరఫున టివిలో ప్రచారం చేసారు.  ఎవరు ఎన్ని చెప్పదలచుకున్నా ఈ రోజు ఆఖరి రోజు అవటంతో రాజకీయ నాయకులంతా సాధ్యమైనంత  వరకు ప్రచారం చెయ్యటానికే పూనుకున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles