Kcr to support rahul after elections to become pm

KCR to support Rahul after elections to become PM, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

KCR to support Rahul after elections to become PM

మరోసారి స్వరం మార్చిన కెసిఆర్!

Posted: 04/28/2014 03:36 PM IST
Kcr to support rahul after elections to become pm

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు స్వరంలో మార్పు వచ్చింది. తెలంగాణా రావటానికి కారణం సోనియా గాంధీయే నంటూ కెసిఆర్ మరోసారి తన స్వరం మార్చారు. తెలంగాణా ప్రదాత సోనియా గాంధీయే అంటున్నారిప్పుడాయన.

రాష్ట్ర విభజన ఆమోదం పొందగానే సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పి వచ్చిన కెసిఆర్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ దేమీ లేదని, కేవలం ఉద్యమం వలనే అది కూడా తెరాస చేసిన వత్తిడి వలనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పిన కెసిఆర్ ఆ పని చెయ్యకపోవటమే కాకుండా ఎన్నికలలో పొత్తు కూడా ఉండదని ప్రకటించారు. దానితో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. కాని ఎన్నికల తర్వాత తెరాస మద్దతు కోసం కలవటానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి అందుకు ఆమోదమేనంటూ లోగడ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తలుపులు మూసుకోలేదన్న సంకేతాలిచ్చారు.

ఎన్డిటివికి కెసిఆర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, అవసరమైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటానికి మద్దతునిస్తాను కానీ, మోదీ పిలిచి మరీ నోరు తెరిచి అడిగినా సరే ఆయనకు మద్దతునిచ్చే ప్రసక్తే లేదన్నారు కెసిఆర్. భాజపా తెదేపాల పొత్తుతో తెలంగాణాలో ప్రచారం జోరు ఎక్కువవటం, దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తెరాసకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో అగ్ర నాయకులను ప్రచారంలోకి దింపటంతో ఎన్నికలలో తెరాస ఆశించిన ఫలితాలు కనిపించవేమో అన్న భయం కలిగిందో లేదో కానీ పోటీ మాత్రం చాలా గట్టిగా ఉంటుందన్న విషయం అర్థమైంది. అందువలన కాంగ్రెస్ లాగానే తను కూడా తలుపులు తెరిచి వుంచితే పోలే అనుకున్నట్టున్నారు, ఎన్నికల తర్వాత మద్దతు విషయంలో కెసిఆర్ ఆ విధంగా ప్రకటన చేసారు. లేకపోతే తెరాస పూర్తిగా ఒంటరిదైపోయే ప్రమాదం కనిపిస్తోంది. భాజపా తెదేపాల కలయిక ఒక వైపు, కాంగ్రెస్ మరో వైపు ఇలా ముక్కోణ పోటీ ముప్పు తెస్తుందని కూడా అనుకుని వుండవచ్చు.

ఎన్నికలలో ఎన్నో వ్యాఖ్యానాలు వస్తుంటాయి కదా!  తాజాగా వెలికి వచ్చిన సిబిఐ దర్యాప్తు విషయంలో కూడా కేంద్రం నుంచి హెచ్చరికల్లాంటి సంకేతాలకు అది నాందా అని కూడా అనుమానాన్ని కొందరు వెలిబుచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles