Social justice not followed by tdp

social justice not followed by TDP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

social justice not followed by TDP in allocating seats in election

కంటితుడుపు కోసం చెప్పే కమ్మనిమాట- సామాజిక న్యాయం?

Posted: 04/18/2014 05:40 PM IST
Social justice not followed by tdp

గురివింద గింజ రాజకీయం అనే పేరుతో మొన్ననే ఒక వ్యాసం రాసాం.  అందులో, ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ సామాజిక న్యాయంతో పేరుతో ఈ సారి ఎన్నికలలో కేటాయిస్తున్న స్థానాలను నిజంగా హృదయపూర్వకంగా ఇస్తున్నట్లయితే గెలిచిన అభ్యర్థులను చూసుకున్నా అదే నిష్పత్తిలో ఉండాలని అనుకున్నాం.  మన అనుమానం నిజమని మచ్చుకి తీసుకున్న ఈ క్రింది గుంటూరు లోని స్థానాలను చూస్తే తెలుస్తుంది. 

లోక్ సభ స్థానాలు – గుంటూరు, నరసరావు పేట – కమ్మ కులస్తులు

శాసన సభ స్థానాలు – 14 శాసనసభ స్థానాలలో 9 స్థానాలు తన సామాజిక వర్గానికి ఇస్తూ,  రెండు కాపు,  ఒక యాదవ, ఒక గౌడ, ఒక ఎస్సీలకు ఇచ్చారు.

లోక్ సభ సీట్లు రెండూ తమ సామాజిక వర్గానికే ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించటమంటే ఆ వర్గం సంక్షేమం చూడటం వరకేనని అనుకుంటున్నారా? అలాగే, 14 శాసనసభ స్థానాలకు 9 తమ సామాజిక వర్గానికే ఇస్తున్నట్లయితే దాదాపు 70 శాతం కేటాయిస్తున్నట్లు!  అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాలో 70 శాతం వారు వారి కులస్తులే ఉన్నారా? 

అన్యాయమనేది అంతటితో ఆగిపోలేదు! 

ఇతర కులస్తులకు ఇచ్చిన ఆ ఐదు స్థానాల్లోను నాలుగు స్థానాలు కచ్చితంగా గెలవలేని స్థానాలే!  ఇది కుట్రపూరిత రాజకీయమనిపించుకోదా?  ఐదవ స్థానమైన ఒక్క మంగళగిరిలో మాత్రం గెలిచే అవకాశాలు సగం సగం ఉన్నాయి.  అక్కడ కూడా తెలగ కులస్తులైన రామచంద్ర ప్రభుకి సీటు ఇవ్వటం వలన పార్టీ కార్యాలయంలో పెద్ద రాద్దాంతం జరుగుతోంది! 

గుంటూరు పశ్చిమ స్థానానికిచ్చిన రెడ్డి కులస్తుడు, గుంటూరు తూర్పుకిచ్చిన ఎస్ సి, రేపల్లెలో గౌడ, బాపట్లలో కాపు, మాచెర్లలో యాదవ కులస్తులు కచ్చితంగా అక్కడున్న ప్రత్యర్థులమీద, అక్కడున్న సామాజిక వర్గ సంఖ్యాబలం ముందు చూసుకుంటే ఓడిపోయేవారే.  అందుకే దాన్ని కంటితుడుపు సామాజిక న్యాయం అని పైన పేర్కొనటం జరిగింది.

ప్రజారాజ్యం పార్టీ వచ్చిన వెంటనే సామాజిక న్యాయం పాటించటం లేదని ఎలుగెత్తిన తెలుగుదేశం పార్టీ ఇప్పడు తను చేసిన పనికి ఏం సమాధానం చెప్తుంది?  తమకో న్యాయం ఇతరులకో న్యాయమేనా సామాజిక న్యాయమంటే?  ప్రజారాజ్యం పార్టీ కొన్ని సిద్ధాంతాలతో వస్తుంటే మొగ్గలోనే చిదిమేసినప్పుడు చేసినవి రెండు పెద్ద ఆరోపణలు.  ఒకటి సామాజిక న్యాయం చెయ్యకుండా తమ కులస్తులకే అగ్రతాంబూలమిస్తున్నారని, రెండవది సీట్ల కేటాయింపులకు కోట్ల రూపాయలలో డబ్బు తీసుకుంటున్నారని! 

ఈ రెండవ ఆరోపణలో కూడా తెదేపా తనవరకు వచ్చేసరికి ఎక్కడా తగ్గలేదు.  ఎక్కడో చిత్తూరులో ఉన్న వ్యాపారవేత్తను, గుంటూరు లోని వ్యాపార వేత్తను, వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళను తీసుకొచ్చి పార్లమెంటు సీటుని వాళ్ళకి ప్రదానం చేసారంటే దాని వెనక ఏం ప్రయోజనం ఉన్నట్లు?  ప్రజాప్రయోజనమైతే కనపడదు!  పార్టీ ప్రయోజనం కూడా కాదు!  కేవలం ఆర్థిక లాభమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది! 

వేరే ప్రాంతాల వ్యాపారవేత్తలకు పార్టీ టికెట్ ఇవ్వటమంటే దాని వెనక ఉన్న ప్రయోజనాన్ని మరేవిధంగానూ చూడలేము.  అంతకంటే సేవచేసే వారు, నాయకత్వ లక్షణాలున్నవారు ఆ ప్రాంతాల్లో లేనే లేరా? 

ప్రజలకు సేవచేసిన జమీందారీ కుటుంబాలున్నాయి, పూర్వకాలం ప్రజాప్రాతినిధ్యం వహించిన కుటుంబాలున్నాయి.  వారిలో ఎవరికి సీటిచ్చినా గెలుపు ఖాయం.  పోనీ పార్టీలో చాలాకాలంగా సేవ చేస్తున్నవారికి న్యాయం చెయ్యటం కోసం చూస్తున్నారా అంటే, ఇంతవరకు రాజకీయాలలోకి రానివారు, వేరే పార్టీల వాళ్ళు, ఈ ప్రాంతానికి చెందినవారికి పార్టీ టికెట్ ఎందుకిచ్చినట్లు?

అంటే, కావలసింది అంకిత భావంతో ప్రజాప్రాతినిధ్యం వహించగలిగే నాయకులు కాదు!  సినిమా టికెట్ ని బ్లాక్ లో కొనుక్కున్నట్లుగా కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకున్న పార్టీ టికెట్.  అటువంటి నాయకుల దగ్గర్నుంచి వోటర్లు ఏమాశించగలరు- వాళ్ళు పెట్టుబడిగా పెట్టిన సొమ్మును మరింతలుగా వెనక్కి తీసుకునే ఆశయం తప్ప?

-శ్రీజ 

Previous article

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles