Sonia gandhi first election meeting in ap

Sonia Gandhi First election meeting in AP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Sonia Gandhi First election meeting in AP

ఈరోజు కరీంనగర్ లో సోనియా అమరుల కుటుంబాలతో భేటీ, సభ

Posted: 04/16/2014 10:20 AM IST
Sonia gandhi first election meeting in ap

ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జరిగే కృతజ్ఞత సభకు సోనియా గాంధీ హాజరవుతున్నారు.  రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి తీవ్రంగా కృషిచేసి అన్ని అడ్డంకులనూ ఎదుర్కుని సాధించిన సోనియా గాంధీ మొదటిసారి తెలంగాణాలో అడుగుపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు కరీంనగర్ లో పెద్ద ఎత్తున స్వాగతానికి ఏర్పాట్లు చేసారు. 

సోనియా గాంధీ దిగ్విజయ్ సింగ్ తదితర నాయకులతో కలిసి త్రివేండ్రం నుంచి 3.15 కి హకీం పేట ఎయిర్ స్టేషన్ కి చేరుకుంటారు.  అక్కడి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 3.55 కి కరీం నగర్ చేరుకుంటారు.  సాయంత్రం 4.00 నుంచి 4.45 వరకు సభలో పాల్గొని, ఆ తర్వాత హెలికాప్టర్ లో హైద్రాబాద్ చేరుకుని, అక్కడి నుండి ఢిల్లీకి విమానంలో తిరిగి వెళ్ళిపోతారు. 

విలీనం పొత్తుల మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి విమర్శలను సంధిస్తున్న నేపథ్యంలో, ఒక పక్క భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం పొత్తుతో ప్రచారంలో ముందడుగులో ఉండగా పార్టీలోనే సరిగ్గా సమన్వయం లేక తెలంగాణాలో కుంటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ లోని నాయకులు, పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపటం కోసం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ సభ తెలంగాణా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద సదభిప్రాయాన్ని ఇంకా పెంచుతుందని నమ్మకం పెట్టుకునివున్నారు. 

2004 లో తెరాసతో పొత్తుతోను, 2009 లో ఒంటరిగానూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న సమయంలో కరీం నగర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన సోనియా గాంధీ, తెలంగాణా ప్రజలు ఏం కోరుకుంటున్నారో తనకి తెలుసని, దాన్ని తప్పక నెరవేరుస్తానని మాటిచ్చారు.  ఇప్పుడు ఆ మాట నెరవేరటం వలన కాంగ్రెస్ నాయకులకు ఆవిషయాన్ని గర్వంగా చెప్పుకోవటానికి పనికివస్తోంది కాబట్టి ఈ సభకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని నమ్ముతున్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత ఆ విషయంలో సోనియా గాంధీ ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి, ఈ రోజు కరీంనగర్ లోని ఆమె మాటలు రాష్ట్రంలో చేసే ప్రప్రధమ ప్రకటనలవుతాయి. 

తెలంగాణా సాధనలో అమరులైనవారి కుటుంబ సభ్యులను కూడా సభా ప్రాంగణానికి పిలిచి వాళ్ళతో సోనియా గాంధీ భేటీ జరిపి, ఆమె చేత వాళ్ళకి హామీ ఇప్పిద్దామని దానివలన ప్రజలలోకి ఇంకా వెళ్ళినట్టుగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles