Balakrishna contesting from hindupur

Balakrishna contesting from Hindupur, Balakrishna TDP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Balakrishna contesting from Hindupur

హిందూపురం నుంచి పోటీ చెయ్యనున్న బాలయ్య

Posted: 04/12/2014 02:45 PM IST
Balakrishna contesting from hindupur

నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన ఆయన అభిమానులు బాణా సంచాతో సందడి చేసి ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.  నందమూరి కుటుంబం హిందూపురానికి మేలు చేస్తుందని, అభివృద్ధి ఖాయమని సంతోషాన్ని వ్యక్తపరచారు. 

ఈరోజు ఉదయం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన బాలకృష్ణ ఎక్కడి నుండి పోటీ చెయ్యాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు.  హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ గని, ఇంకా ఇతర స్థానిక నేతలతో కూడా బాలకృష్ణ ఈ విషయంలో చర్చించారు. 

సంప్రదింపులన్నీ అయిపోయి ఒక నిర్ణయానికి రాగానే బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీకి దిగబోతున్నారని చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. 

ఏప్రిల్ 16న బాలకృష్ణ నామినేషన్ దాఖలు చెయ్యబోతున్నారు.  లెజెండ్ సినిమా పూర్తవటం కోసం రాజకీయాలకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఆ చిత్రం పూర్తవటమే కాకుండా విజయవంతమవటంతో ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి విశేష పూజలు చేయించారు. 

ఇక ఎప్పటినుంచో అభిమానులంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.  సినిమాలలో హీరోగా అలరించిన బాలకృష్ణ రాజకీయరంగ ప్రవేశం చేసి తన తండ్రి స్థాపించిన తెలుగు దేశం పార్టీలో క్రియాశీల రాజకీయాలలోకి రానున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles