350 fell ill after consuming panakam at ramnavami pandals

350 fell ill after consuming panakam at Ramnavami pandals, Panakam in drums used for mixing pesticide, 350 hospitalized consuming panakam, Sriramanavami 2014

350 fell ill after consuming panakam at Ramnavami pandals

పానకం తాగిన 350 మందికి అస్వస్థత

Posted: 04/11/2014 09:33 AM IST
350 fell ill after consuming panakam at ramnavami pandals

మండు వేసవిలో వచ్చే శ్రీరామనవమి వేడుక జరిగేది మిట్ట మధ్యాహ్నమే కాబట్టి, చల్లని పానీయాలు తాగుతుంటారు.  అయితే భక్త జనులకు ప్రత్యేకంగా పానకం తయారు చేసి ఉచితంగా వితరణ చెయ్యటం ఆనవాయితీగా వస్తోంది.  చల్లని నీరు, బెల్లం, మిరయాలపొడితో తీపిగా ఘాటుగా తయారు చేసే పానకం శరీరంలో తాపాన్ని తగ్గిస్తుంది, శక్తినీ ఇస్తుంది.

అయితే, ఎంత దైవ ప్రసాదంగా భావించినా ఆరోగ్య సూత్రాలను పాటించకపోతే మాత్రం దేవుడు కూడా క్షమించడని నల్గొండ జిల్లా దామరచర్లలో నిరూపితమైంది. కోదండరామస్వామి ఆలయం దగ్గర వితరణ చేసిన పానకం తాగి 350 మంది హాస్పిటల్ పాలయ్యారు.  ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని డాక్టర్లు నిర్థారించారు. 

మరి అంత మంది తాగితే 350 మందే ఎందుకు అనారోగ్యం పాలయ్యారా అని చూస్తే, ఒకటేమో రోగనిరోధక శక్తి (స్టామినా) ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది.  అది మాత్రమే కాకుండా, ఏడు డ్రమ్ములలో పానకం కలిపారు, అందులో రెండు డ్రమ్ములను అంతకు ముందు పొలంలో చల్లటం కోసం పురుగు మందు కలిపారట.  వాటిని పానకం కలిపే ముందు సరిగ్గా శుభ్రం చెయ్యకపోవటమే కారణమని చెప్తున్నారు.  జిల్లా ఆరోగ్య కేంద్రం అధికారి పానకం శాంపిల్ ని ల్యాబ్ లో పరీక్షణకు పంపించారు.

బాధితులకు మిర్యాల గూడ, దామరచర్ల హాస్పిటల్స్ లో వాళ్ళకి చికిత్స జరుగుతోంది.  బోర్డ్ ఎగ్జామ్ రాసే 10 వ తరగతి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ పంపించామని కూడా తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles