Change in modi affidavit

Change in Modi Affidavit, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Change in Narendra Modi Affidavit with nomination for 2014 elections

మోదీ అఫిడవిట్ లో మార్పు

Posted: 04/10/2014 04:26 PM IST
Change in modi affidavit

భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ బుధవారం నాడు వడోదర పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తను వివాహితుడనని, భార్య పేరు జశోదా బేన్ అని రాసారు.  ఇంతకాలం తాను ఒంటిరినని ప్రకటిస్తూ భార్య పేరు దగ్గర ఖాళీ వదిలేస్తూ వచ్చిన నరేంద్ర మోదీ ఈ సారి భార్య పేరు రాస్తూ తన ఆస్తుల భోగట్టా మాత్రమే ఇస్తూ ఆమె ఆస్తి పాస్తుల వివరాలు తనకి తెలియవని అన్నారు.

తను ఒంటరివాడవటం వలన అవినీతికి పాల్పడటం, వారసులకు దోచిపెట్టవలసిన అవసరం తనకెంత మాత్రం లేదని చెప్తూ వచ్చిన మోదీ ఈ సారి తన భార్య పేరు కూడా రాసారు.  అందుకు కారణం 62 సంవత్సరాల జశోదా బేన్ ఈమధ్య కాలంలో తాను టీచర్ గా చేసి రిటైర్ అయ్యానని, తనకొచ్చే పెన్షన్ తో కాలం వెళ్ళదీస్తున్నానని, తనకి ఎటువంటి ఇబ్బంది కానీ కోరికలు కానీ లేవని, తన సోదరునితోపాటు ఉంటున్నానని చెప్తూ,  పెళ్ళైన సమయంలో తన వయసు 17 సంవత్సరాలని, పెళ్ళైన మూడు సంవత్సరాలకు తాము విడిపోయామని, అప్పటి నుంచి మళ్ళీ మోదీని చూడలేదని ఆమె ఒక మేగజైన్ ఇంటర్వ్యూలో చెప్పారు.  అంతేకాదు తను కూడా మోదీ అభిమానినయ్యానని అన్నారావిడ. అందువలన నరేంద్ర మోదీ తన అఫిడవిట్ లో ఈసారి ఆమె పేరైతే రాసారు కానీ ఆమె వివరాలు తనకి తెలియవని పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ సోదరుడు సోమాభాయ్ దామోదర్ చేసిన పత్రికా ప్రకటనలో, మోదీకి చిన్న వయసులోనే పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళయిందని, కానీ దేశానికి సేవ చేసే ఉద్దేశ్యంతో ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని, 45 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు తవ్వుకోవటం అనవసరమని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles