Bjp senior leader ale narendra passed away

BJP senior leader Ale Narendra passed away, Tiger Narendra, Ale Narendra died, Ale Narendra fought for Telangana, Ale Narendra represented Medak

BJP senior leader Ale Narendra passed away

భాజపా సీనియర్ నేత ఆలె నరేంద్ర కన్నుమూత

Posted: 04/09/2014 04:56 PM IST
Bjp senior leader ale narendra passed away

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అలె నరేంద్ర (68)  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఆయన ఈరోజు నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సాయంత్రం 4.00 గంటలకు కన్నుమూసారు. 

1983 నుంచి 1994 వరకు భాజపా తరఫున శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నరేంద్ర 1999 లో పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించారు.  ఆ తర్వాత తెలంగాణా సాధన సమితిని స్థాపించి, దాన్ని తెలంగాణా రాష్ట్ర సమితిలో విలీనం చేసారు.  తెరాస నుంచి కూడా బయటకు వచ్చిన నరేంద్ర కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఏర్పరచుకుని 2004 లో మెదక్ నుంచి పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించారు.  యుపిఏ ప్రభుత్వంలో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. 

అలా 1999 లో భాజపా తరఫున, 2004 లో కాంగ్రెస్ తరపున మెదక్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికైన నరేంద్ర చివరకు మళ్ళీ భాజపాలో చేరారు. ఫోటోలో నరేంద్ర మళ్ళీ భాజపాలో చేరిన సందర్భంగా.

ఆగస్ట్ 21, 1946లో హైద్రాబాద్ లో జన్మించిన ఆలె నరేంద్ర టైగర్ నరేంద్రగా పేరుగాంచారు.  ఆయన భార్య లలిత, వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 

నరేంద్ర మరణ వార్త విన్న భాజపా నాయకులు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles