Second attack on kejriwal in four days

Second attack on Kejriwal in four days, Arvind Kejriwal, Aam Admi Party, Dalhi Sultanpuri road show of Kejriwal, Kejriwal slapped, Attacker of Kejriwal thrashed hospitalized

Second attack on Kejriwal in four days

కేజ్రీవాల్ మీద మరోసారి దాడి- తప్పెవరిది?

Posted: 04/08/2014 03:33 PM IST
Second attack on kejriwal in four days

నాలుగు రోజుల్లో రెండో సారి ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి జరగింది.  ఈ సారి ఆటో డ్రైవర్.  ఈరోజు ఢిల్లీ సుల్తాన్ పురి లో కేజ్రీవాల్ రోడ్ షో చేస్తుండగా లాలి అనే ఆటో డ్రైవర్ ఆయన వాహనం మీదకు ఎక్కి దాడి చేసాడు. దానికి ముందు అతను కేజ్రీవాల్ మెడలో దండ వేసాడు.  చేతిలో దండ ఉండటం వలన అతన్ని ఎవరూ అడ్డుపెట్టలేదు.  కానీ తీరా చూస్తే అతను కేజ్రీవాల్ ని ముఖం మీద ప్రహారం చెయ్యటం మొదలుపెట్టాడు.

"ఆటో డ్రైవర్ల ద్రోహి" అని కూడా కేజ్రీవాల్ ని ధూషించాడతను. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో ఆటో డ్రైవర్లంతా కేజ్రీవాల్ కి బ్రహ్మరథం పట్టిన వాళ్ళే.  వేలాది మంది ఆటో డ్రైవర్లు కేజ్రీవాల్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారప్పుడు.  వాళ్ళే ఇప్పుడు ఎదురు తిరిగారంటే ఏమైయ్యుంటుందా అని కేజ్రీవాల్ తన ట్విట్టర్ సందేశంలో ఇలా రాసారు-

"నామీద ఎందుకిలా వరుసగా దాడి చేస్తున్నారా అన్నదే నేను ఆలోచిస్తున్నాను.  దీని వెనక పనిచేస్తున్నవాళ్ళెవరు.  వాళ్ళకేం కావాలి.  నాకు సమయం, స్థలాన్ని చెప్పండి నేనే అక్కడికొస్తా.  దానితో దేశ సమస్యలకు పరిష్కారం దొరికే పక్షంలో నన్ను వాళ్ళిష్టమొచ్చినట్లు కొట్టమనండి."

శుక్రవారం దక్షిణపురి లో రోడ్ షో చేస్తున్నప్పుడు కూడా ఒక మనిషి ఆయన వాహనం మీదకు వచ్చి చెంపమీద కొట్టాడు.  హర్యానాలో కూడా కేజ్రీవాల్ మెడ మీద పిడిగుద్దులు గుద్దాడు ఒకతను.  పోయిన నెలలో వారణాసి వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ మీద సిరా పోసారు, కోడి గుడ్లు విసిరారు. 

అయితే, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనలను తీవ్ర స్థాయిలో ఖండించాయి. 

దాడి ఎందుకు చేసినా తప్పే కానీ, కేజ్రీవాల్ అంటున్నట్టుగా నిజంగా దాడి చేసిన వాళ్ళు ఇతర పార్టీల ప్రేరేపణతో దాడి చేసారా అంటే అది సరి కాకపోవచ్చు.  చెప్పుకోవటానికి, ఆ ఘటనను తన మీద సానుభూతిని పెంచుకోవటం కోసం వాడుకోవటానికైతే పనికొస్తుందేమో కానీ ఈ దాడులన్నీ కూడబలుక్కుని చేసినట్టుగా లేవు.  నిజంగానే కేజ్రీవాల్ మీద వాళ్ళకి పెరిగిన కసి, పోలీసు రక్షణ లేకపోవటం కేజ్రీవాల్ మీద దాడికి దిగటానికి వాళ్ళు భయపడకుండా చేస్తోందనిపిస్తోంది.  దాడి వలన ముందుగా అనుమానం కలిగేది ఇతర పార్టీల మీదనే కాబట్టి అలాంటి పనికి ఒడిగడతానిపించటం లేదు. 

దాడి చెయ్యటం తప్పే, దాని గురించి అవమానపడటం, బాధపడటం, పోటీగా పనిచేస్తున్న పార్టీలను అనుమానపడటం కూడా సహజమే కానీ దాడి చేసిన మనిషిని చావగొట్టిన తన పార్టీ వాళ్ళని కేజ్రీవాల్ ఏమీ అనటం లేదు.  దాడిలో కేజ్రీవాల్ ఎడమ కన్ను వాచింది.  నిజమే అది తప్పే.  కానీ ఆ మనిషి ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నాడు.  మరి అది ఎంతవరకు సమర్ధనీయం.  కొడుతున్న మనిషిని అడ్డుకోవటం, లాగి వెయ్యటం వరకు సరే కానీ ఆ తర్వాత కూడా ఒకరి తర్వాత మరొకరు అతన్ని కుళ్లపొడవటం ఎంత వరకు సమంజసం. 

శుక్రవారం దాడి చేసిన మనిషిని కూడా దేహ శుద్ధి చేసిన తర్వాతనే పోలీసులకు అప్పజెప్పారు.  దీని వెనక ఏ పార్టీ హస్తముందా అని ఆలోచించే ముందు కేజ్రీవాల్ నిజంగా సామాన్యులకోసం పోరాడుతున్నవారైతే, ఆ మనిషిని కలిసి అతనికి అంత కసి ఎందుకు వచ్చిందన్నది తెలుసుకుని తనలోని లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ, ఆ సంఘటనను మరింతగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవటం కాదు. 

అందువలన, పోలీసులు కూడా దాడి చేసినవాళ్ళమీద కేసు పెట్టేముందు అతన్ని కొట్టినవాళ్ళ మీద, ఆ బృందానికి నాయకుడి మీద కూడా కేసు పెట్టవలసివుంటుంది.  ఈ ఘటన మీద కేజ్రీవాల్ స్పందన మీడియాలోకి వచ్చింది కానీ, దాడి చేసిన మనిషి మాటలు రావు.  అది పోలీస్ కేస్  అయినప్పుడు ఆ మనిషితో పూర్తిస్థాయి ఇంటర్వ్యూకి అనుమతించరు కూడా!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles