Sri ramavavami at bhadrachalam

Sri Ramavavami festival at Bhadrachalam, Rama Navami in AP state, Annual Wedding of Sri Ram and Sita, Bhadrachalam Temple, Godavari at Bhadrachalam

Sri Ramavavami festival at Bhadrachalam

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు

Posted: 04/08/2014 08:40 AM IST
Sri ramavavami at bhadrachalam

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామికి ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఎప్పటిలాగానే వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు చేసారు. 

ఈ రోజు తెల్లవారు ఝామున 5.04 కే నవమి పూర్తైపోతుంది కానీ, శ్రీరామునికి పునర్వసు నక్షత్రంలోనే వేడుకలు జరపటం ఆనవాయితీ కాబట్టి ఈ రోజు చేస్తున్నారు. 

యాత్రికులతో కిట కిట లాడుతూ వివిధ అలంకరణలతో, భక్త జనసందోహంతో కళకళలాడుతున్న భద్రాచల పట్నంలో భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసేవారు చేస్తుంటే దైవ దర్శనానికి బారులు తీరేవారు కొందరు, కళ్యాణ మండపంలో రామునికోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు మరికొందరు. 

ఉదయం 9.30 నుంచి 10.30 వరకు ఊరేగింపుతో వెళ్ళే కోదండరాముడు 10.30 నుంచి 12.30 వరకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటాడు.  ప్రతిసారీ ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఈ సారి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నందువలన గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా జరుగబోతోంది. 

భక్తుల సౌకర్యం కోసం చేసిన ఏర్పాట్లను, ఇతర రవాణా, భద్రత మొదలైన అంశాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles