Ramcharan tej in wwf cycle rally

Ramcharan Tej in WWF cycle rally, Earth hour on March 29, Akkineni Amala, APIIC, Reddy Labs

Ramcharan Tej in WWF cycle rally

29న సైకిల్ ర్యాలీలో పాల్గొనబోతున్న రామ్ చరణ్ తేజ్

Posted: 03/28/2014 08:39 AM IST
Ramcharan tej in wwf cycle rally

సైక్లింగ్ అనేది శరీరారోగ్యానికే కాకుండా పర్యావరణ రక్షణకి కూడా తోడ్పడుతుందని మనందరికీ తెలుసు.  ఈనెల 29 న రామ్ చరణ్ తేజ్ సైకిల్ ర్యాలీ లో పాల్గొనబోతున్నారు.  పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం వహిస్తూ, ఆరోజు డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఆధ్వర్యంలో గచ్చి బౌలి నుండి కూకట్ పల్లి వరకు జరిగే ఈ సైకిల్ ర్యాలీలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కూడా సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ తో పాటు సైకిల్ల ర్యాలీ కార్యక్రమంలో భాగం వహించబోతున్నారు. 

అదేరోజు రాత్రి డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ సంస్థ ఎర్త్ అవర్ ని నిర్వహిస్తోంది.  గురువారం మీడియా సమావేశంలో ఆ సంస్థ చేసిన ఈ ప్రకటనలో, 29 న రాత్రి 8.30 నుంచి 9.00 వరకు విద్యుత్పకరణాలను, లైట్లను ఆఫ్ చెయ్యవలసిందిగా కోరారు.  ఈ చర్య పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు.

ఈ సమావేశంలో సినీ నటి అక్కినేని అమలో పాటు రాష్ట్ర ఇంధన పరిరక్షణ సంస్థ సిఇవో చంద్రశేఖర రెడ్డి, ఏపి ఐఐసి ఎండీ జయేష్ రంజన్, రెడ్డీస్ ల్యాబ్స్ సిఇవో జివి ప్రసాద్, ఆ సంస్థ ఛైర్మన్ అనీల్ కుమార్ మొదలైనవారు పాల్గొన్నారు.

సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ భాగస్వామ్యంతో 29 న కార్యక్రమం రసమయంగా ఉంటుందని డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles