Fire erupts again in tirumala forest area

Fire erupts again in Tirumala forest area, Seshachalam forest in Tirumala hills, Fire at Papavinashanam in Tirumala, TTD fighting with fire

Fire erupts again in Tirumala forest area, Seshachalam forest in Tirumala hills

తిరుమల శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు

Posted: 03/27/2014 12:48 PM IST
Fire erupts again in tirumala forest area

ఐదు వేల హెక్టార్ల అటవీ సంపదను హరించి, కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించి, తిరుమల భక్తులకు భయం, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదుర్దా కలిగించిన మంటలు ఐదు రోజుల పోరాటంతో సమసిపోయాయనుకుంటే మరోసారి పాపవినాశనం దారిలో మంటలు చెలరేగటం తితిదే యాజమాన్యానికి పరీక్షగా తయారైంది.

పోయినసారి అతి కష్టం మీద హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.  మరోసారి చెలరేగి ఆందోళన కలుగజేస్తున్న మంటలను ఆర్పటానికి తితిదే సిబ్బంది కృషిచేస్తోంది. 

అడవుల వలన వన్య మృగాలతో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండటం సహజమే కానీ ఇలా దావానలం ఇంత పెద్ద ఎత్తున దగ్ధం చేయటం ఇదే మొదటిసారి అంటున్నారు తితిదే అధికారులు.  అయితే ఈ సారి అదే ప్రాంతంలో చెలరేగుతున్న మంటల వలన అంత నష్టం ఉండదంటున్నారు అధికారులు.  ఎందుకంటే, తగలబడగలిగినవి పోయినసారే తగలబడ్డాయి కాబట్టి ఈ సారి ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించటానికి అవకాశం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles