Congress manifesto for 2014 elections

congress manifesto for 2014 elections, Sonia Gandhi, Rahul Gandhi, Manmohan Singh AK Antony, NDA Government, UPA Government

congress manifesto for 2014 elections

కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల హామీలు విడుదల

Posted: 03/26/2014 02:25 PM IST
Congress manifesto for 2014 elections

కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2014 ఎన్నికలకు గాను మేనిఫెస్టోని విడుదల చేసింది.  ఆ సమావేశంలో ప్రధాన మంత్ర మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ తదితర వరిష్ట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

ఎన్నికల ప్రణాళికను తయారు చెయ్యటంలో ఈసారి కొత్త పద్ధతిని అవలంబిస్తూ, అందరి అభిప్రాయలనూ సేకరించి తదనుగుణంగా రూపొందించమని సోనియా గాంధీ అన్నారు.

2009 లో చేసిన ఎన్నికల హామీల్లో 90 శాతం పూర్తిచేసామని రాహుల్ గాంధీ అన్నారు.  పరిశ్రమల ద్వారానే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని కూడా ఆయన అన్నారు. నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన సిద్ధాంతం ఇద్దరు భారతీయుల మధ్య తగవు పెట్టే విధంగా ఉంటుందని, ఆయన ఒక వ్యక్తే అయినా, ఆయన ఆలోచనా సరళితో దేశంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కూడా రాహుల్ గాంధీ అన్నారు.

ముందు చూపుతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ లా కాకుండా అన్ని వర్గాలకూ అభివృద్ధి ప్రయోజనాలు కలిగేలా రూపుదిద్దామన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్.  వృద్ధిరేటు విషయంలో చూసుకుంటే ఎన్డీయే కంటే యూపిఏ అధికారం లో ఉన్నప్పుడే పెరిగిందని అన్నారాయన. 

సోనియా గాంధీ చేసిన హామీలలో, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తామని, వెనకబడిన వర్గాలకు అండదండలు, ఉత్పాదనను పెంచటం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించటం ఉన్నాయి. వారణాసి నుండి కూడా ఎన్నికలలో పోటీ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమని, అయితే ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చెయ్యాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు సోనియా గాంధీ

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles