శుక్రవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బస్ యాత్ర పార్టీలో కొంత ఉత్సాహం, చిరు ఆశలు నింపే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ సందర్భంగా విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధి చిరంజీవి, నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు తమ వెంటనే ఉన్నారని, కార్యకర్తలు అభిమానులే తమకి కొండంత అండ అని అన్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు విశాఖపట్నం నుంచే పార్టీకి ఎక్కువ మద్దతు లభించిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి, అలాంటిది విశాఖ జిల్లా నాయకులు పార్టీని వీడిపోవటం దురదృష్టకరమని, తనకెంతో మనస్తాపాన్ని కలిగిస్తున్నదని అన్నారు.
కాంగ్రెస్ ని బలహీన పరచటానికి మిగతా పార్టీలు చేస్తున్న కుట్రే తప్ప కాంగ్రెస్ కి ప్రజల అండదండలు, కార్యకర్తల వెన్నుదన్నులు అలాగే ఉన్నాయన్నారు చిరంజీవి. శ్రీకాకుళం లో బస్ యాత్ర పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని కూడా చిరంజీవి ప్రజలకు వాస్తవాలను చెప్పటం, కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించటమే 13 జిల్లాలలో కాంగ్రెస్ చేసే బస్ యాత్ర ఉద్దేశ్యమని అన్నారు.
నాయకులు పార్టీని వదిలిపోయారు కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా చిరంజీవి సూచించారు.
ఈ సందర్భంలో ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, జెడి శీలం, సుబ్బిరామిరెడ్డి, తదితరులు పాల్గొని, కేంద్రంలో కాంగ్రెస్ రావటం తథ్యమని, సీమాంధ్రను తీర్చిదిద్దటం తప్పక జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరచారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more