Will people ignore jagan money laundering

Will people ignore Jagan money laundering, YSR Congress party, YSR, YS Jagan, YS Sharmila, YSR popular schemes

Will people ignore Jagan money laundering

టేఢా హై పర్ మేరా హై- జగన్ విషయంలో వర్తిస్తుందా?

Posted: 03/21/2014 05:04 PM IST
Will people ignore jagan money laundering

కుర్ కురే ప్రకటనలో అన్నట్లుగా టేఢా హై పర్ మేరా హై అంటే, తేడాగా ఉన్నా మరి నా వాడే అని సర్దుకున్నట్లుగా జగన్ విషయంలో తెలుగువాళ్ళు మనసుకి సర్దిచెప్పుకుంటారా అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.  మనవాడు అనుకున్నప్పుడు ముక్కు కారుతున్నా ముద్దే వస్తాడు.  పరాయి వాడు ఎంత అందంగా ఉన్నా నచ్చడు. 

మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ విషయంలో తెలుగు వాళ్ళంతా, ఆయన తండ్రి వైయస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన పాదయాత్రలు,  దరిమిలా ఆయన కుమారుడు, ఆయన కూతురు కొనసాగించిన పాదయాత్రలు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలతో చేసిన ప్రసంగాలతో ఆకర్షితులై మోసపూరితంగా సంపాదించిన ఆస్తుల విషయంలో పట్టించుకోకుండా ఉంటారా అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది.  ఎన్నికలు అవుతేనే కాని ఆ విషయం అర్థం కాదు. 

అక్రమార్జనలు జరిగాయన్నది తెదేపా లెక్కల ప్రకారం లక్షకోట్లు అవునో కాదో తెలియకపోయినా మొత్తానికి పెద్ద మొత్తంలోనే కుంభకోణం జరిగిందన్నది తేటతెల్లంగానే వుంది.  రాష్ట్రంలో బీదరికపు రేఖకు దిగువలోనే ఎక్కువ జనాభా ఉండటం వలన ఆ లెక్కలను పట్టించుకోకుండా ప్రస్తుతం లాభిస్తున్న పథకాలకు ఆకర్షితులవుతారా లేక పోతే ఇంతవరకు జగన్ చెప్పింది నోటితో చెప్పిందే కానీ గతంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి తన సామర్థ్యాన్ని చూపించిన చంద్రబాబుని నమ్ముతారా అన్నది చెప్పటం ఎవరికైనా కష్టమే కాదు అసాధ్యమే. అందులోనూ, వైయస్ ఆర్ మరణం తర్వాత వచ్చిన సానుభూతి పవనాలకు చాలా కాలమవటం వలన అవి బలహీనపడే అవకాశం ఉంది.  జైలుకి వెళ్ళటం, దీక్షలలాంటివి ప్లస్ పాయింట్లే అయినా, జైలుకి వెళ్లిన కారణమైతే బలమైనదే. 

ఫలితాలు వచ్చిన తర్వాత విశ్లేషణ చేసుకోవచ్చు, కారణాలతో లెక్కలను గిట్టించవచ్చేమో కానీ వోటర్ల నాడి పట్టుకోవటం సాధ్యమైన పని కాదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles