Kodandaram refused to take part in politics

Kodandaram refused to take part in politics, TJAC Chairman Prof Kodandaram, TNGOs President Devi Prasad, TGO President Srinivas Gowd

Kodandaram refused to take part in politics

కోదండరామ్ తిరస్కరించిన రాజకీయ భాగస్వామ్యం

Posted: 03/13/2014 04:57 PM IST
Kodandaram refused to take part in politics

తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ బుధవారం నాడు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుతో భేటీ అవటంతో ఆయన రాజకీయాలలోకి వస్తున్నారా అన్న సందేహం వచ్చింది.  అయితే ఆయన దాన్ని కొట్టిపారేసారు.

తెలంగాణా ఐకాస ఛైర్మన్ కోదండరామ్, తెలంగాణా నాన్ గెజెటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడు జి.దేవి ప్రసాద్ లకు కెసిఆర్ ఎన్నికలలో పోటీ చెయ్యటానికి పార్టీ టికెట్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు కానీ వాళ్ళిద్దరూ వాటిని తిరస్కరించామని చెప్పారు.  కోదండరామ్ కి మల్కాజ్ గిరి కాని సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ లలో ఒకటి, దేవి ప్రసాద్ కి సంగారెడ్డి శాసనసభ సీట్ ని ఆఫర్ చెయ్యగా వాటిని తిరస్కరించామని, తమకు రాజీకీయాలలో పదవులు వద్దని కేవలం తెలంగాణా అభివృద్ధిలో మాత్రమే భాగం వహిస్తామని ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇప్పుడూ చెప్పామని అన్నారు.

తెలంగాణా గెజెటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్కక్షుడు శ్రీనివాస గౌడ్ ని తెరాస పార్టీ సభ్యుడిగా తీసుకుంటూ ఆయనకి మోహబూబ్ నగర్ శాసన సభ టికెట్ ఇవ్వబడింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles