Shatrucharla joining tdp

Shatrucharla Vijayaramaraju joining TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Congress leaders joining TDP

Shatrucharla Vijayaramaraju joining TDP

తెలుగు దేశంలో చేరనున్న శత్రుచర్ల

Posted: 03/13/2014 03:24 PM IST
Shatrucharla joining tdp

విజయనగరం జిల్లా లోని కాంగ్రెస్ నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మనుగడ లేదని తెలుసుకున్న ఆ పార్టీ నాయకులంతా వలసలు పోవటం ప్రారంభించారు.  వాళ్ళకి వలసలు పోవటానికి ఉన్నవి మూడే మూడు పార్టీలు- తెలుగుదేశం, వైయస్ఆర్ కాంగ్రెస్, జైసమైక్యాంధ్ర.  వీటిలో ఎక్కువ మంది తెలుగు దేశం పార్టీకే మొగ్గు చూపించటానికి కారణం, చంద్రబాబు నాయుడు అన్నట్లుగానే చక్రం తిప్పుతున్నారనే భావనతో పాటు, హైద్రాబాద్ ని అభివృద్ధి చేసిన విధంగానే అవకాశమిస్తే సీమాంధ్రను కూడా అభివృద్ధి చెయ్యగలరని ప్రజలు నమ్ముతున్నారన్న నమ్మకం.

శత్రుచర్ల తో పాటు జనార్దన్ ధాట్రాజు తదితరులు రేపు చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరటానికి నిర్ణయం తీసుకున్నారు.

మూడు సార్లు శ్రీకాకుళం జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ నుండి ఎన్నికైన శత్రుచర్ల 2004 లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ టెర్మ్ లోను, 2009 లోనూ అటవీ శాఖామాత్యులుగా పనిచేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles