Devyani khobragade cases closed in us

Devyani Khobragade cases closed in US, Indian Diplomat Devyani Khobragade, Devyani domestic help Sangeeta Richard, Diplomatic Immunity to Devyani Khobragade

Devyani Khobragade cases closed in US, Indian Diplomat Devyani Khobragade, Devyani domestic help Sangeeta Richard

దేవయాని మీద కేసు కొట్టివేత

Posted: 03/13/2014 09:00 AM IST
Devyani khobragade cases closed in us

భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రాగడే మీద అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది.  దేవయానికి లభించిన ఇమ్యూనిటి మూలంగా కేసును కొట్టివేస్తున్నామని జడ్జ్ షిరా ఎ స్కీండ్లిన్ ప్రకటిస్తూ ఈ కేసును మూసివేయవలసిందిగా కోర్టుకు తెలియజేసారు.  దేవయాని మీదున్న బెయిల్ నియమాలను రద్దు చేసారు.  ఈ కేసులో ఇంతవరకు జారీ అయిన నోటీసులు, వారంట్లను కోర్టు ఉపసంహరించుకోవటం కూడా జరిగింది. 

భారత మూలాలున్న యుఎస్ అటర్నీ ప్రీత్ భరార్ దేవయాని ఖోబ్రాగడే మీద ఆమె ఇంట్లో పనిచేసే సంగీతా రిచర్జ్ విషయంలో వీసా నియమాల ఉల్లంఘన కింది కేసు పెట్టారు.   ఆమెను డిసెంబర్ 12 2103 న ఆమె పిల్లలు చదువుకునే స్కూల్ బయట అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచే ముందు ఆమెను వివస్త్ర తనిఖీకి గురిచేసి, జైలులో కరడుగట్టిన నేరస్తుల మధ్య గడిపేట్టుగా చేసారు. 

అమెరికా వ్యవహారం మీద ఆగ్రహించిన భారత ప్రభుత్వం అందుకు ప్రతిగా భారత్ లోని అమెరికన్ కార్యాలయ సిబ్బందుల మీద ఆంక్షలు విధించటం లాంటి ప్రతీకార చర్యలకు పూనుకున్నారు.  భారత్ అమెరికాల మధ్య సంబంధాలు కూడా చెడిపోవటం మొదలుపెట్టాయి.  దేవయాని మీద కేసుని బలోపేతం చేస్తూ అమెరికన్ అధికారులు, ఆమెను రక్షించటానికి భారత్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసాయి.  చివరకు జనవరి 9 న దేవయాని డిప్లామాటిక్ ప్రొటెక్షన్ తో భారత దేశానికి తిరిగివచ్చారు. 

అయినా అమెరికాలో మిగిలిపోయిన దేవయాని మీద కేసులు ఈ కోర్ట్ ఆదేశాలతో పూర్తిగా మూసివేయబడ్డాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles