Winning horses in ap jc diwakar reddy

Winning horses in AP JC Diwakar Reddy, JC Brothers join TDP, Paritala Ravi, Parital Sunita, Kiran Kumar Reddy, YSR Congress, Payyavula Keshav

Winning horses in AP JC Diwakar Reddy, JC Brothers join TDP

గెలుపు గుర్రం -3 జెసి దివాకర్ రెడ్డి

Posted: 03/10/2014 04:56 PM IST
Winning horses in ap jc diwakar reddy

జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ రాజకీయవేత్త.  ఈయన ఐదు సార్లు ఒకే నియోజకవర్గం- అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే తాడిపత్రి నుంచి శాసనసభకు ఎన్నికైన నాయకుడు.  పరిటాల రవి గ్రూప్ కి జెసి బద్ధ శత్రువు. 

జెసి దివాకర్ రెడ్డి ఎవరికీ భయపడకుండా చేసే కరుకైన మాటలకు ప్రతీతి.  2004 నుంచి 2009 వరకు వైయస్ ఆర్ కాంగ్రెస్ లో క్యాబినెట్ పనిచేసిన జెసి కి 2009 లో క్యాబినెట్ లోకి అవకాశమివ్వలేదు.  2010 లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జెసి కి క్యాబినెట్ లో చోటివ్వలేదు.  కాంగ్రెస్ లో పనిచేస్తూనే కాంగ్రెస్ పార్టీ మీద, సోనియాగాంధీ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు జెసి.  వైయస్ ఆర్ కి సన్నిహితులే అయినా జెసి కి వైయస్ జగన్ తో కలవటం ఎక్కువగా ఇష్టం లేదు కానీ అనంతపూర్ లో తెదేపా ఇన్ ఛార్జ్ గా ప్రేమా నాగిరెడ్డి ఉండటంతో వైకాపాలో చేరుదామా అని జెసి బ్రదర్స్ అనుకున్నారు కానీ మనసు మార్చుకున్నారు.  తాడిపత్రి అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ప్రేమా నాగిరెడ్డి వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరటం వలన జెసి గ్రూప్ తెదేపాలో చేరటానికి మొగ్గు చూపించింది.  వచ్చేవారం తెదేపాలో చేరుతామని జెసి ప్రకటించారు.

తెలుగు దేశం తరఫున అనంతపూర్ జిల్లా నుంచి పోటీ చేస్తానని శనివారం నాడు ప్రకటించిన జెసి దివాకర్ రెడ్డి, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహించి అభివృద్ధి చేసే సత్తా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే ఉందని అన్నారు. 

అనంతపూర్ పార్లమెంట్ సీటుని, తాడిపత్రి శాసనసభ సీటుని జెసి బ్రదర్స్ అడుగుతున్నారు కానీ తాడిపత్రి సీటు మాత్రమే ఇవ్వటానికి తెదేపా అంగీకరించింది.  హిందుపూర్ లో మాట్లాడిన జెసి దివాకర్ రెడ్డి తాను పార్లమెంటరీ సీటుకి, తన తమ్ముడు ప్రభాకరరెడ్డి శాసనసభ సీటుకి పోటీచేస్తామని అన్నారు. 

ఎన్నికలలో ఓటమినెరుగని జెసి దివాకర రెడ్డి తెలుగు దేశం పార్టీకి గెలుపు గుర్రమనే అనుకోవచ్చు.  కాకపోతే పరిటాల సునీత, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్, మాజీ ఎంపీ కలువ శ్రీనివాసులు తెదేపాలో జెసి సోదరుల చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  పార్టీలోని సభ్యులు కూడా రెండు ఫ్యాక్షన్ల మధ్య నలిగిపోయినవారు జెసి చేరికను వ్యతిరేకిస్తున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన జెసి బ్రదర్స్ రాకను ఆహ్వనించవలసిందిగా పార్టీ నాయకులకు నచ్చచెప్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles