Pawan kalyan to touch all aspects in politics

Pawan Kalyan to touch all aspects in politics, Pawan Kalyan political party, Pawan Kalyan aims to win in both regions, Pawan Kalyan aims for 10 parliament seats, Pawan Kalyana aims for 40 assembly seats, Pawan Kalyan book on politics

Pawan Kalyan to touch all aspects in politics

అన్ని అంశాలనూ స్పృశించనున్న పవన్ కళ్యాణ్

Posted: 03/10/2014 11:42 AM IST
Pawan kalyan to touch all aspects in politics

పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ గురించి ఈనెల 14న సాయంత్రం 6.30 గంటలకు చేస్తున్న ప్రకటనలో, తన పార్టీ ఉద్దేశ్యాలు, లక్ష్యాలతో పాటు జాతీయ అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ యువత, మహిళలు, విద్యా రంగాలలో అభివృద్ధి ఎలా ఉండాలనేదాన్ని విశదీకరించనున్నారు. 

పవన్ కళ్యాణ్ తనే పవర్ స్టారని, ఆయనకి పవర్ మీద ఆశ ఏమాత్రం లేదని, ఆయన కేవలం ప్రస్తుతమున్న రాజీకీయాలను ప్రశ్నిస్తూ ఆదర్శవంతమైన రాజీకీయాల ప్రస్తావన తెస్తారని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలలో పనిచేస్తున్నవారు చెప్తున్నారు.

మార్చ్ 14న పవన్ కళ్యాణ్ తాను రాజీకీయాల గురించి సమగ్రంగా రాసిన పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు.  అది సమగ్రమే కాబట్టి అందులో అన్ని రాజకీయ అంశాలనూ స్పృశించి అన్నిటికీ సమాధానాలు చెప్పబడతాయని అంటున్నారు. 

రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలోను 40 అసెంబ్లీ సీట్లు, 10 లోక్ సభ సీట్ల లక్ష్యంతో తన రాజకీయ రంగప్రవేశం చెయ్యబోతున్న పవన్ కళ్యాణ్  ఆయా నియోజకవర్గాలలో చెయ్యవలసిన కార్యక్రమాల వ్యూహరచనలో పడ్డారని తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం కోసం హైటెక్స్ లో సినీ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles