తన సొంత భార్యనే పట్టించుకోని వ్యక్తి ఇక ప్రజలకు ఏం సేవా చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ కొత్త వివాదం పై కామెంట్ చేస్తుంది. ఈ పాయింట్ ను టార్గెట్ చేసుకొని బీజేపి ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు.
ఇప్పటి వరకు వ్యక్తి గత విమర్శలు చేసుకోకుండా రాజకీయ విమర్శలే చేయటం జరిగింది. ఈసారి ఏకంగా మోడీ భార్య ను టార్గెట్ చేసుకోని దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకు మోడీ భార్య గురించి పెద్దగా ఎవరికి తెలియదు. దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్ తో దేశ ప్రజలు మోడీ వ్యక్తి విషయం పై ఆసక్తి పెంచారు. మోడీగారు ఆయన భార్యని ఎందుకు దాస్తున్నారు? ఆమె ను బయట ప్రపంచానికిఎందుకు పరిచయం చేయటం లేదు? ఆమె ఇప్పుడు ఒక సాధారణ మహిళగా అద్దె ఇంటీల్లో జీవినం సాగిస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
అంతేకాకుండా ఎన్నికల దరఖాస్తులో భార్య పేరు నమోదు చేయాల్సి ఉండగా మోడీ ఆ కాలమ్ ను ఎందుకు విడిచిపెట్టారని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఆమె వివరాలు చెప్పకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారని విమర్శించారు.
ఈ అంశానికి సంబంధించి మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. జశోదా బెన్ ను మోడీ పెళ్లి చేసుకున్నారా లేదా? అలా అయితే విడాకులిచ్చారా? ఆమెతో ఎందుకు కలిసి ఉండట్లేదు ? తన వైవాహిక స్థితిని ఆయన ఎందుకు ప్రకటించలేదని దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మహిళల దినోత్సం రోజే నరేంద్ర మోడీ పై దిగ్విజయ్ సింగ్ ఇలాంటి విమర్శలు చేయటంతో .. మహిళ సంఘాలు మోడీ పై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై నరేంద్ర మోడీ ఏం చెబుతారో చూడాలి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more