ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తన నాలుగు రోజులు గుజరాత్ పర్యటన తర్వాత ప్రత్యేక మీడియా సమావేశంలో పాల్గొనటం కోసం జైపూర్ వెళ్ళారు. విమానాశ్రయం నుంచి హోటల్ కి మెర్సెడిస్ కారులో చేరుకున్నారు. అక్కడి నుండి ఢిల్లీకి ప్రైవేట్ విమానంలో చేరుకున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాప్టర్లు, విమాన ప్రయాణాల మీద మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానిస్తూ వచ్చిన కేజ్రీవాల్ ప్రైవేట్ విమానంలో ప్రయాణం చెయ్యటం మీద సోషల్ మీడియాలో సంచలనం రేగుతున్న సందర్భంగా కేజ్రీవాల్ వివరణనిచ్చారు.
ఇండియా టుడే నిర్వహిస్తున్న సమావేశానికి ఈరోజు వచ్చాను. రెగ్యులర్ ఫ్లైట్ లేకపోవటం వలన ఇండియా టుడే గ్రూప్ నా కోసం ఖర్చులు భరించి నేను ఢిల్లీకి సకాలంలో చేరుకోవటం కోసం విమానాన్ని ఏర్పాటు చేసింది అంటూ కేజ్రీవాల్ తన ట్విట్టర్లో ప్రకటించారు. మోదీ గారు, రాహుల్ గాంధీలు కూడా అలాగే వారు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లు విమాన ఖర్చులను ఎవరు భరిస్తున్నారన్నది తెలియజేయవలసి వుంటుంది అన్నారాయన.
మోదీ మీడియాని కలవలేదు, ప్రత్యేక విమానాలలో వెళ్ళి ప్రసంగాలిచ్చి తిరిగివచ్చారంతే. ఇదేనా ప్రజాస్వామ్యం అని కేజ్రీవాల్ ప్రశ్నించారు జైపూర్ మీడియా సమావేశంలో. ప్రజలంతా మోదీ వైపు మొగ్గు చూపిస్తున్నారని అన్న మీడియా ప్రతినిధులకు, కేజ్రీవాల్ అదేం కాదన్నారు. ఇది మోదీ వేవ్ కాదు ప్రజల క్రోధాగ్ని. ఇది దేశంలో పెను మార్పులను తీసుకునిరాబోతున్నది అని సమాధానమిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more