Leaders in telangana pcc race

Leaders in Telangana PCC race, D.Srinivas, K.Jana Reddy, D.Aruna, Shabbir Ali, Damodara Raja Narasimha, J Geetha Reddy

Leaders in Telangana PCC race

పిసిసి రేస్ లో నాయకులు

Posted: 03/06/2014 02:11 PM IST
Leaders in telangana pcc race

రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాలకు రెండు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను నియమించాలా అని ఆలోచిస్తోంది.  ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు కానీ తెలంగాణాలో ఆ పోస్ట్ కోసం నాయకులు క్యూ కడుతున్నారు. 

సీమాంధ్రలో పిసిసి అధ్యక్ష పదవిని ఎవరూ కోరుకునేవారు లేరు కానీ, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం కోసం పట్టుదలతో చివరి వరకూ పోరాడి రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణా ప్రజలు విశ్వాసం చూపిస్తారని, ఎలాగైనా తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆశాభావంతో ఉన్న సీనియర్ నాయకులు పిసిసి అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు.

అందుకోసం ఆశపడుతున్న నాయకుల విషయంలో వినిపిస్తున్న పేర్లు ఇవి- కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, ఇప్పటికే రెండుసార్లు పిసిసి అధ్యక్ష పదవిని అలంకరించిన డి.శ్రీనివాస్.  మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాత్రం ఇప్పుడు ప్రాంతీయంగా పిసిసి లను విభజించటం అవసరం కాదన్న తన అభిప్రాయాన్ని ప్రధాన మంత్రికి వివరించారు. 

విశ్వనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణా ప్రాంత పిసిసి అధ్యక్ష పదవికి జానారెడ్డి ప్రధమ శ్రేణిలో ఉన్నారు.  అయితే డి.శ్రీనివాస్ మాత్రం ఆ పదవి తననే వరిస్తుందన్న ఆశాభావంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రా ప్రాంతంలో కాపు కులాల వారికి ఈ పదవిని కట్టబెట్టాలని కేంద్రం భావిస్తోంది.  అందులోమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరా రెడ్డి బరిలో ఉన్నారని సమాచారం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles