దేశంలోని 543 లోక్ సభ సభ్యులను ఎన్నుకోవటానికి రంగం సిద్ధమౌతోంది. ఈరోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ని విడుదల చెయ్యబోతోంది.
అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండవ వారం నుండి మే 16 వరకు 9 విడతలలో ఎన్నికలను నిర్వహిస్తారు. ఎన్నికలకు ఇంత ఎక్కువ కాలాన్ని కేటాయించటం వలన భద్రతా సిబ్బందిని ఒకచోటి నుండి మరో చోటికి పంపించటానికి అవసరమైన వ్యవధి దొరకుతుంది, అన్ని చోట్లా అవసరమైన మేరకు భద్రతా ఏర్పాట్లకు అవకాశం ఉంటుంది.
ఈరోజు షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశంలో ఎన్నికల నియమావళి అమలు లోకి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఎటువంటి హామీలను ఇవ్వటానికి వీలుండదు. అయితే లోక్ పాల్ నియామకం, అవినీతి నిరోధక అమలుకోసం ప్రత్యేక హోదాలో అడ్వకేట్ (అంబుడ్స్ మన్) నియామకాలు జరగటానికి ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కాబట్టి.
ఇక సీమాంధ్రకు చేసిన హామీలకు కూడా ఢోకా లేదంటున్నారు రాష్ట్ర విభజనకోసం ఏర్పడ్డ మంత్రుల బృందంలో చురుగ్గా పాల్గొన్నకేంద్ర మంత్రి జైరామ్ రమేష్. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం మూడు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. లోక్ సభ కాల పరిమితి జూన్ తోను, శాసనసభల పరిమితి జూన్ 2 తోనూ ముగియనున్నాయి.
ఈసారి లోక్ సభ ఎన్నికలకు ఎలక్ట్రానికి వోటింగ్ మెషీన్ లో నోటా (ఏ అభ్యర్ధీ వద్దు) అని వోటర్ తెలియజేయటానికి అవకాశం కల్పించబడుతోంది. కానీ దాని ఫలితాల మీద ఎలా స్పందించాలన్న విషయంలో ఇంకా చట్టబద్ధంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more