State and center governments of india

State and Center governments of India, AP State Reorganization Bill 2014, Telangana Appointed day, State Government, President Rule, Governor of AP

State and Center governments of India

రాష్ట్రంలో అంతా చేతులు దులిపేసుకున్నా కేంద్రానికి తప్పదు

Posted: 03/05/2014 07:41 AM IST
State and center governments of india

కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఆవిర్భావానికి ముహూర్తం పెట్టింది.  అది జూన్ 2.  ఆంధ్రప్రదేశ్ శాసన సభా కాలపరిమితి జూన్ 2 తో తీరిపోతుంది కాబట్టి ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి, 29వ రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించాలని నిర్ణయం జరిగింది.  అయితే అంతా సజావుగా జరగాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ లోపులోనే ప్రధాన కార్యదర్శి ద్వారా అస్తులు అప్పుల భట్వారా, కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల భట్వారా కార్యక్రమంలో పడింది.

ఎవరి ఇంట్లో వాళ్ళు శుభ్రం చేసుకుంటారు కానీ బయట వదిలిపెట్టేస్తారు.  ఎందుకంటే అది కామన్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్ కాబట్టి.  అక్కడ శుభ్రం చేసేవాళ్ళను వేరుగా నియమించవలసి వస్తుంది.  అలాగే ఎవరి ఇంట్లో వాళ్ళు దీపం పెట్టుకుంటారు.  బయట నలుగురి కోసం దీపాలు వెలిగించేవాళ్ళు వేరే వుంటారు.  అలాగే రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలయ్యే పార్టీలన్నీ తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం  మాత్రమే ధనాన్ని కానీ సమయాన్ని కానీ వెచ్చిస్తారు.  అక్కడే అవసరం వస్తుంది కేంద్ర ప్రభుత్వ రంగ ప్రవేశం.

రాష్ట్రాల సంక్షేమాన్నంతా సమీకరిస్తూ జాతీయ స్థాయిలో కూడా పనులు చెయ్యవలసింది కేంద్ర ప్రభుత్వమే.  అందుకే ముందు జాగ్రత్తగా భట్వారా కార్యక్రమాలను సక్రమంగా జరిపించటం కోసం ఇంతవరకూ విధుల్లో ఉన్న ప్రధాన కార్యదర్శి కాల పరిమితి పెంచుతూ పనులు చేయిస్తోంది కేంద్ర ప్రభుత్వం.  రాష్ట్రంలో అందరూ చేతులు దులిపేసుకున్నారు.  కానీ కేంద్ర ప్రభుత్వానికి అలా కుదరదు.  రాజకీయాలు, ఎత్తుకు పై ఎత్తులు పక్కన పెడితే, రాష్ట్రాల మధ్య తగవులు రాకుండా ప్రభుత్వాలు పడిపోయినప్పుడు రాష్ట్రాలలోని కార్యకలాపాలు ఆగిపోకుండా చూడవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. 

ఇవన్నీ కాకుండా దేశ సురక్ష, భద్రత, విదేశాలతో సత్సంబంధాలు, వ్యాపార వాణిజ్యాల లాంటి విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వమే తలకెత్తుకుంటుంది.   అందువలన కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు వింటే తప్పేమీ కాదు, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కూడా ప్రజలే. 

తెలంగాణా ఇక అనివార్యమని తెలిసిపోగానే, అన్ని దార్లూ మూసుకున్నాయని అందరికీ అర్థమయ్యేటప్పటికి రాష్ట్రంలోని పార్టీలన్నీ వచ్చే ఎన్నికల మీద దృష్టి సారిస్తోంది.  ఆందోళనలు, నిరసనలు, లేఖాస్త్రాలు, భేటీలు ఆగిపోయాయి.  ఇంటిని చక్కదిద్దుకునే కార్యక్రమంలో పడ్డాయి పార్టీలన్నీ.  రాష్ట్రంలో ప్రభుత్వానికి కాలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాజీనామాతోనే చెల్లిపోయింది.  రాష్ట్ర విభజన చెల్లదంటూ విభజనకు ముందు పలుమార్లు సుప్రీం కోర్టు తలుపు తట్టినవాళ్ళంతా తీరా విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాని గురించి మర్చిపోయారు.  అప్పుడు సుప్రీం కోర్టు ఇంకా ఆ సమయం రాలేదు అని పిటిషన్లను కొట్టి పారెయ్యటం జరిగింది.  ఇప్పుడు అలా చెయ్యదు.  కానీ పిటిషన్ పెట్టేవాళ్ళు ఇప్పుడెవరూ లేరు.  కేవలం తమ మనుగడ మీదనే అందరూ దృష్టి సారిస్తున్నారు. 

అయితే మేము కేంద్ర ప్రభుత్వానికి లొంగి ఎందుకు పని చెయ్యాలి అనే ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తుంటుంది.  ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు, రెండూ వ్యతిరేకమైన అభిప్రాయాలతో ఉన్నప్పుడు.  విచిత్రంగా ఈసారి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తమ సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కుంది, మద్దతిస్తుందని ప్రగాఢంగా నమ్మిన తెరాస కలిసిరావటంలేదు. 

రాష్ట్రంలో పటిష్టమైన ప్రభుత్వం కావాలని ఎలా కోరుకుంటామో అలాగే కేంద్రంలో కూడా పటిష్టమైన ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం సౌభాగ్యంతో విలసిల్లుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles