President approves president rule on ap state

President approves President Rule on AP State, President Pranab Mukherjee, Governor ESL Narasimhan, Article 356

President approves President Rule on AP State

రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ఆమోదం

Posted: 03/02/2014 09:35 AM IST
President approves president rule on ap state

రాష్ట్రపతి ఆమోదం లభించటంతో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం సూచించిన రాష్ట్రపతి పాలన మొదలైంది.  ఈ ప్రక్రియలో రాష్ట్ర గవర్నర్ కి రాష్ట్రాన్ని నడిపే అధికారాలుంటాయి. 

ఇంతకు ముందు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న ముఖ్యమంత్రి తనకు చేదోడుగా వివిధ శాఖలను పర్యవేక్షించటానికి మంత్రులను నియమించుకుని రాష్ట్ర పాలన చేసారు.  కానీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి అవకాశం లేని సందర్భంలో ఆ రాష్ట్రంలో, రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకోవచ్చు. 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి కూడా తిరస్కరణ చూపించటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరో ముఖ్యమంత్రిని నియమించి ప్రభుత్వాన్ని కొనసాగించటమా లేకపోతే శాసనసభను సుప్తచేతనలో పడవేసి రాష్ట్రపతి పాలనకు సూచించటమా అన్నదాని మీద చర్చించుకుని చివరకు రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపించింది.  ఆ నిర్ణయం మీద రాష్ట్రపతికి ఆయన ఆమోదం కోసం పంపించగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అందుకు సమ్మతించటంతో రాష్ట్ర గవర్నర్ మీద అదనపు బాధ్యతలు పడుతున్నాయి. 

రాష్ట్రపతి పాలన గురించిన అవగాహన కోసం ఈ క్రింది వీడియోను వీక్షించండి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles