We will build a better capital than hyderabad says chandrababu

We build better capital than Hyderabad Chandrababu, TDP Prajagarjana at Vizianagaram, TDP President Chandrababu Naidu, Jairam Ramesh, Botsa Satyanarayana, YS Jagan, Sonia Anaconda

We will build a better capital than Hyderabad says Chandrababu

హైద్రాబాద్ ని తలదన్నే రాజధానిని నిర్మిస్తాం- చంద్రబాబు

Posted: 02/27/2014 08:40 AM IST
We will build a better capital than hyderabad says chandrababu

బుధవారం రాత్రి విజయనగరంలో అయోధ్యా మైదానంలో జరిగిన ప్రజాగర్జన సభలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రసంగంతో సభకు విచ్చేసిన అశేష జనానీకాన్ని ఆకట్టుకున్నారు. 

భావి తరాల కోసమే తాను పాటు పడుతున్నానని, తనకోసం తన అధికారం కోసం చేసే పోరాటం కాదని అన్న చంద్రబాబు తనకి అవకాశమిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానని వాగ్దానం చేసారు.  తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి కష్టపడి సీమాంధ్రను తీర్చిదిద్దుతానని అన్నారాయన. 

తెలుగుదేశం అధికారం లో ఉన్నప్పుడు రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నడి వీధిలో సోనియా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు చంద్రబాబు. 

జైరాం రమేష్ భిక్షం మనకు వద్దు.  రాజధానిని ఎక్కడ నిర్మించుకోవాలో ఎలా నిర్మించుకోవాలో మాకు తెలుసు దాంట్లో కూడా వేలు పెట్టవద్దు అని ఆవేశంగా మాట్లాడారు చంద్రబాబు.  అయితే తాను ఒక్కడే చేసే పని కాదని అందరూ చెయ్యీ చెయ్యీ కలిపితేనే ప్రగతి సాధ్యమని అన్నారు.

సోనియా గాంధీ అనకొండ అని, ఆమె తనలాంటి అనకొండలను తయారు చేసిందని, అందులో బొత్సా సత్యనారాయణ, జగన్ లాంటి వారు చాలా మంది ఉన్నారని అన్నారు చంద్రబాబు.  సోనియాను రాష్ట్ర విభజనలో ప్రధమ ముద్దాయిగా పేర్కొన్నప్పుడు భారీ ఎత్తున ర్యాలీ లో పాల్గొన్న జనం నుంచి పెద్ద ఎత్తున అనుకూలంగా స్పందన వచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles