Kiran fires at center over telangana

Ex CM Kiran, Kiran Kumar Reddy, Telangana, Sonia Gandhi, Jagan Mohan Reddy, Nara Chandrababu Naidu, Kiran new party, Seemandhra, Seemandhra student JAC, central government, Congress Party, Kiran fires at Center over Telangana,

Kiran fires at Center over Telangana, Kiran Reddy silent on new party launch, Samaikyandhra JAC students in Hyderabad, Ex CM Kiran addressing seemandhra JAC students

సమైక్య స్టూడెంట్స్ సమావేశంలో ఆగ్రహించిన కిరణ్ ?

Posted: 02/26/2014 07:48 PM IST
Kiran fires at center over telangana

సమైక్య వాది అయిన  మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు  సమైక్యంద్ర స్టూడెంట్స్ తో  సమావేశం  అయ్యారు. ఈ సమావేశంలో  కిరణ్ కుమార్ రెడ్డి ఉగ్రరూపం చూపించారు.  కాంగ్రెస్ పార్టీ,  వైఎస్ జగన్ , చంద్రబాబు లపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. 

*  ఇప్పుడు విద్యార్థుల సత్తా చాటే సమయం వచ్చిందని ఆయన సీమాంధ్ర విద్యార్థులనుద్దేశించి అన్నారు.  

*   సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. దొడ్డిదారిన రాష్ట్ర విభజన చేశారని కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

*  రాష్ట్ర విభజనపై నా పోరాటం ఆగదు, జగన్, కేసీఆర్‌ను నమ్మే కాంగ్రెస్ ముందుకు వెళ్లిందని ఆయన అన్నారు.

*  రాష్ట్ర విభజనపై తన పోరాటం ఆగదని, త్వరలో సుప్రీం కోర్టుకు వెళతానని  కిరణ్ కుమార్‌రెడ్డి  అన్నారు

*  యువత వెంట ఉంటే పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

*  కాంగ్రెస్ పెద్దలు తెలుగు వారిని అవమానించారని కిరణ్ అన్నారు. 

*  చదువు, ఉద్యోగం ఇలా అన్ని అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయని ఆయన అన్నారు. 

*  కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఆంధ్రప్రదేశ్ కోసం తాను రాజీనామా చేశానని కిరణ్ అన్నారు. 

*  భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 

*  విద్యార్థి దశలోనే అనేక ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన అన్నారు. 

*  తెలుగువారిని అవమానిస్తే మౌనంగా ఉండాలా? మన రాజధానిని తీసుకుని వెళ్ళిపొమ్మంటే పోవాలా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. 

*  సీమాంధ్రలు సంక్రాంతికి వెళితే... హైదరాబాద్ ఎడారిలా మారిందని... విభజన అనంతరం అదే పరిస్థితి ఉంటుందని కిరణ్ జోష్యం చెప్పారు. 

*  చంద్రబాబు గుడ్డిగా లేఖ రాయటం వలనే..రాష్ట్ర విభజన జరిగిందని  కిరణ్ అన్నారు.

*  వైఎస్ జగన్  బెయిల్ విషయంలో  కాంగ్రెస్ సహాయం చేసిందని, అందుకే జగన్ కు  రాష్ట్ర విభజనకు  సహకరించారని  కిరణ్ అన్నారు. 

*  సీమాంద్ర ప్రజలను  చంద్రబాబు,  వైఎస్ జగన్  మోసం చేసారని  అన్నారు. 

*  కాంగ్రెస్ బీఫారం అక్కరలేదని, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. 

*  పార్లమెంటులో దొంగచాటుగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

*  తెలుగు జాతి మధ్య చిచ్చుపెట్టి ఒకర్నొకరు కొటుకునేటట్లు కేంద్ర ప్రభుత్వం చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

*  తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిందనే తాను పార్టీని, ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నానని విద్యార్ధులకు కిరణ్ స్పష్టం చేశారు. 

*  తన రాజీనామాను ఇప్పటివరకు అంగీకరించలేదని, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమని కేంద్రం నాపై ఒత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు. 

*  గవర్నర్‌కు రెండో లేఖ కూడా రాశానని, సీఎం పదవిలో కొనసాగలేనని, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు కిరణ్ పేర్కొన్నారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles