Telangana capital changed to karimnagar

Telangana capital changed to Karimnagar, TRS Chief KCR, Telangana capital Warangal or Karimnagar, KCR constituency Karimnagar, Hyderabad revenue

Telangana capital changed to Karimnagar

రాజధానిని కరీంనగర్ కి బదలాయింపు!

Posted: 02/25/2014 10:32 AM IST
Telangana capital changed to karimnagar

కాబోయే ముఖ్యమంత్రిగా తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మంచి నిర్మాణాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని ఒక తెరాస నాయకుడు తెలియజేసారు.  అదేమిటంటే తెలంగాణా రాజధానిని కరీం నగర్ కి మార్చటం. 

ఇందులో నిర్మాణాత్మకమేముంది, చాలా ఖర్చుతో కూడిన పని కదా అని పార్టీలో అన్నదానికి కెసిఆర్ ఇలా సమాధానమిచ్చారట- పిచ్చివాళ్ళలారా హైద్రాబాద్ ఎలాగూ మనదే.  అది ఎట్లాగూ అభివృద్ధి చెందేవుంది.  అక్కడినుంచి వచ్చే ఆదాయానికేమీ ఢోకా లేదు.  ఎవరికీ అందులోంచి పైసా ఇచ్చేది లేదు.  ఇక కరీంనగర్ లో రాజధానిని ఏర్పాటు చేస్తే అది రెండో మహానగరంగా వృద్ధి చెందుతుంది. 

అంతే కాదు దేశ రాజధాని ఢిల్లీకి మన రాజధాని ఇంకొంచెం దగ్గరవుతుంది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారట.  రాజధాని అన్నాక మరి అక్కడా పెద్ద రైల్వే స్టేషను, మెట్రో వగైరాలన్నీ వస్తాయి.  కరీం నగర్ నుంచి డైరెక్ట్ గా రామగుండం స్టేషన్ కి కలిపితే అది మెయిన్ రైలు మార్గమే అవుతుంది.  అలా కరీం నగర్ కూడా తెలంగాణాలో హైద్రాబాద్ కి దీటుగా మరో పెద్ద నగరంగా రూపొందే అవకాశం ఉంది అని అన్నారటాయన. 

మరి వరంగల్ నే రాజధాని చెయ్యొచ్చుగా అది ఇప్పటికే ఢిల్లీ మెయిన్ లైన్ లో ఉందిగా అన్నారొక పార్టీ నాయకుడు.  కానీ నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఇక తిరుగుండదు కదా అని కెసిఆర్ సమాధానమిచ్చారట.

ఇంతవరకు ఉద్యమం, వ్యవసాయంలో మాత్రమే దిట్ట అనుకున్నాం కానీ కెసిఆర్ తెలంగాణాను బాగా అభివృద్ధి చేస్తారని కూడా దీనితో అర్థమౌతుంది అన్నారు మిగిలిన తెరాస నాయకులు.

ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా కెసిఆర్ నిర్ణయాన్ని హర్షించారు.  రాజకీయ లబ్ధిని పక్కకు పెడితే, వరంగల్ ని పర్యాటక స్థలంగా, కరీంనగర్ ని రాజధానిగా తీర్చిదిద్దితే హైద్రాబాద్ తో పాటు తెలంగాణాలో మరో రెండు నగరాలు వెలుస్తాయి సుమా అన్నారు వాళ్ళు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles