Bride gives birth to child right during her wedding ceremony

Man Singh, Damayanti Bai, Bride delivers baby on wedding day, Madhya Pradesh,w edding ceremony.

Bride gives birth to child right during her wedding ceremony

పెళ్లిపీట్లమీదనే తండ్రైన పెళ్లికొడుకు?

Posted: 02/24/2014 11:00 AM IST
Bride gives birth to child right during her wedding ceremony

ఇది నిజంగా ఒక వింతే అని అంటున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి  వింత జరిగి ఉండదని పెళ్లి కొచ్చిన బంధువులు అంటున్నారు. సహజంగా పెళ్లిలో అందరు ఆనందంగా ఉంటారు.  కానీ ఇక్కడ పెళ్లిలో మాత్రం అందరు ఆశ్చర్యపోయారు. పెళ్లి మండపంలో పెళ్లి పీటలపై వరుడు, వధువు కూర్చున్నారు. 

పురోహితుడు వేదామంత్రాలు చదువుతున్నారు. మంగళవాయిద్యాలు మొగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో పెళ్లి కూతురు  భరించలేని  నొప్పితో బాధపడుతూ కనిపించటంతో..  పెళ్లికొచ్చిన బంధువులు పెళ్లి కూతుర్ని .. పక్క గదిలోకి  తీసుకెళ్లి,  పది నిమిషాల తరువాత.. పండుంటి మగబిడ్డతో బయటకు వచ్చారు. ఇదేదో సినిమాలో జరిగిన  సన్నివేశం కాదు. ఇది రియల్ లైప్ జరిగిన సంఘటన . 

మద్యప్రదేశ్ లోని దిండోరి జిల్లాలో జరిగిన సంఘటన. పెళ్లి మండపంలో  మాన్ సింగ్ , దమయంతి పెళ్లి జరుగుతున్న సమయంలో  ఈ సంఘటన చోటు చేసుకుంది.  ఈ విషయం  తెలుసుకున్న  పెళ్లి  కొడుకు బంధవులు ఆశ్చర్యం, ఆవేశంతో, పెళ్లి ఆపేయండి కేకలు వేశారు. కానీ పెళ్లి కొడుకు మాత్రం  అందుకు నిరాహకరించాడు.  

నేను దమయంతినే పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో..  కుల పెద్దలకు, బంధువుల కోపం కట్టలు తెంచుకోని రావటంతో ,దయమంతిని పెళ్లి చేసుకుంటే  జరినామా కట్టాల్సి వస్తుందని చెప్పటం జరిగింది. అయితే మాన్ సింగ్  కులపెద్దలకు, కుటుంబ బంధువులకు భయపడకుండా.. ఆ జరినామా కట్టి,  దమయంతిని తన భార్య చేసుకున్నాడు.

 తన భార్యకు పెట్టిన మగబిడ్డను  మాన్ సింగ్ తన చేతిలోకి తీసుకొని పెళ్లి కూతురు ఆనందంగా పెళ్లి మండపం దిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ సంఘాలు  మాన్ సింగ్  చేసి పనికి మొచ్చుకుంటున్నాయి. 

కట్టుకున్న  మొగుడితో కాపురం చేసి బిడ్డల్ని కంటే. డిఎన్ ఏ  టెస్ట్ చేయించుకోని  కాపురం చేస్తున్న భర్తలు  చాలా మంది  ఈ సమాజంలో ఉన్నారు. అలాంటిది తన పెళ్లి మండపంలోని తల్లైన పెళ్లి కూతుర్నిమాన్ సింగ్  పెళ్లి  చేసుకున్నందుకు   మహిళ సంఘాలు   హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles