Precautions in view of dharnas at delhi

Precautions in view of dharnas at Delhi, seemandhra protesters,SeemandhraDharna at Delhi

Precautions in view of dharnas at Delhi, seemandhra protesters

ఆందోళనల దృష్ట్యా ఢిల్లీలో ముందస్తు జాగ్రత్తలు

Posted: 02/17/2014 08:17 AM IST
Precautions in view of dharnas at delhi

సీమాంధ్ర ఆందోళనకారులను నియంత్రించటానికి ఢిల్లీ బలగాలు వీలైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.  అందులో భాగంగా ఢిల్లీలోని మూడు మెట్రో స్టేషన్లను మూసివేసారు.  ఉద్యోగ్ భవన్, సెంట్రల్ స్టేషన్, రేస్ కోర్స్ రోడ్ మెట్రో స్టేషన్లను మూసివేయటం ద్వారా మూకుమ్మడిగా దాడిచేసే అవకాశం ఉండదని భావిస్తూ ఆ చర్యలు తీసుకున్నారు.  దీనితో స్థానికులు అవస్థలు పడుతున్నారు.  అయితే దీని వలన తమ రాక అందరికీ తెలుస్తోందని, దేని కోసమైతే ఆందోళన చేస్తున్నామో ఆ అంశానికి జాతీయ స్థాయిలో అవగాహన పెరుగుతుందని సీమాంధ్ర ఆందోళనకారులు భావిస్తున్నారు.  

ఎపిఎన్జీవోలు నిర్వహించిన ఆరు ప్రత్యేక రైళ్లలో చలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు ప్రత్యేక రైళ్ళలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.  

ఆందోళన చేసేవారు ఏ వర్గానికి చెందినవారు, వారి ఉద్దేశ్యాలేమిటి, అందులో హింసలకు పాల్పడే నైజం ఉన్నవారున్నారా అన్న విషయంలో వాళ్ళు బయలుదేరిన జిల్లాల నుంచి ఢిల్లీ పోలీసులు ఆరాలు తీసినట్లుగా కూడా తెలుస్తోంది.  

సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఈరోజు జరపనున్న సభకు రామ్ లీలా మైదాన్ లో ఏర్పాట్లు కూడా సమగ్రంగా పూర్తిచేసుకున్నారు.  సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఈ రోజు రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి.  దీనికి పదిహేనువేల మంది హాజరవుతారని అంచనా.  రాష్ట్రం నుంచి వెళ్ళినవారు రాత్రిపూట పడుకోవటానికి, తినటానికి కావలసిన ఆహార పొట్లాల ఏర్పాటు పూర్తిగా చేసుకుని సంసిద్ధంగా ఉన్నారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles