Tdp rethinking on alliance with bjp

TDP rethinking on alliance with BJP, Chandra Babu Naidu, L K Advani, Sushma Swaraj, Arun Jaitley, Rajnath Singh, BJP TDP alliance

TDP rethinking on alliance with BJP, Chandra Babu Naidu

భాజపాతో మైత్రీ బంధానికి పునరాలోచనలో పడ్డ తెదేపా

Posted: 02/15/2014 10:14 AM IST
Tdp rethinking on alliance with bjp

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నదాంట్లో తెలుగు దేశం పార్టీ తిరిగి ఆలోచనలో పడింది. 
తెలంగాణా బిల్లు ఆగిపోయిన పాపమంతా భాజపా నెత్తిన రుద్దుదామని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని తిప్పికొడుతూ భాజపా తాము తెలంగాణాకు వ్యతిరేకులం కామని, కేవలం సీమాంధ్ర ప్రజలకు న్యాయచెయ్యమని కోరుతున్నామంతే నని అన్నారు. 
భాజపా అగ్రనాయకులు ఎల్ కె అద్వానీ రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో భేటీ అవుతూ పార్టీల పొత్తు గురించి, తెలంగాణా బిల్లు మీద సమన్యాయం విషయంలో చర్చిస్తూ వచ్చిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, శుక్రవారం తెలంగాణా రాష్ట్రం విషయంలో చేసిన పార్టీ నాయకుల ప్రకటనలతో మరోసారి ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. 
ఈ ప్రకటన వలన సీమాంధ్రలో భాజపాకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.  అలాంటి సందర్భంలో భాజపాతో పొత్తు తెదేపాకు ఎందుకూ పనికిరాదు సరిగదా వ్యతిరేక ఫలితాలనిచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది. 
నిజానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పార్టీ నాయకుల ప్రకటనలు ప్రజలలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి కాబట్టి స్పష్టంగా పార్టీ వైఖరిని ప్రకటించవలసిందిగా ఆ పార్టీ పెద్దలను కోరారని తెలిసింది.  అందుకే వాళ్ళంతా తెలంగాణా విషయంలో తమ ధోరణి మారలేదని, కేవలం సీమాంధ్రకు న్యాయం చెయ్యమని అడుగుతున్నామని అన్నారు.
భాజపా తెదేపా పొత్తు విషయంలో ఇప్పటి వరకూ ఏ పార్టీ తమ ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చలేదు.  అంతేకాదు మీడియా ప్రతినిధులు నేరుగా అడిగిన ప్రశ్నకు కూడా పొత్తు విషయంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదనే ఇరు పార్టీల వారూ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles