Thoofan in tea cups

Thoofan in tea cups, Modi video conference chaypecharcha, BJP Prime Ministerial candidate Narendra Modi, AICC Vice President Rahul Gandhi

Thoofan in tea cups with BJP video conference with chayvalas

టీ కప్పులో తుఫాను

Posted: 02/12/2014 11:27 AM IST
Thoofan in tea cups

మోదీ ప్రధానమంత్రి అవలేరు కానీ టీ మాత్రం అమ్ముకోగలరు అంటూ కాంగ్రెస్ నాయకుడు శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని రూపొందించింది.  ఈరోజు దేశవ్యాప్తంగా చాయ్ వాలాలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా జరగబోతోంది.

21 వ శతాబ్దంలో మోదీ ప్రధానమంత్రి అవటం కుదరని పని అని, ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో టీస్టాల్ పెట్టుకుంటానంటే అందుకు ఏర్పాట్లు చేసిపెడతాం అని జనవరి 17న శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు భాజపా సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ వెంటనే అందుకు దీటుగా, వంశపారంపర్యంగా వస్తున్న పాలనకు ఒక చాయ్ వాలా అడ్డుపెట్టారంటే అది ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి అని చెప్పుకోవచ్చని అన్నారు.

300 నగరాల్లో 1000 టీ స్టాల్స్ ని గుర్తించిన భాజపా వీడియో కాన్ఫరెన్స్ కి ఏర్పాట్లు చేసింది.  గుజరాత్ లోనే 22 నగరాల్లో 61 ప్రదేశాలలో టీ స్టాల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ జరగబోతోంది.  ఈ చాయ్ పే చర్చా కార్యక్రమంలో ప్రధానంగా చర్చనీయాంశం దేశంలో సుపరిపాలన అన్నదానిమీద చర్చ. 

డిటిహెచ్, సాటిలైట్ సర్వీస్, సోషల్ మీడియాల ద్వారా నరేంద్ర మోదీ ఈ రోజు చాయ్ తాగుతూ సమావేశం నిర్వహించబోతున్నారు.   ఎంపిక చేసిన వెయ్యి ప్రదేశాలలో 30 నుంచి నేరుగా చర్చలో పాల్గొనే వెసులుబాటు కలిగించారు. 

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకుంటున్న భాజపా పట్ల రాహుల్ గాంధీ అసహనం వ్యక్తపరచి ఏ పార్టీ మీదనైనా వ్యాఖ్యలు చేసే ముందు పర్యవసానాన్ని ఆలోచించాలని అనటమే కాకుండా తన గుజరాత్ పర్యటనలో, ప్రతి టీ దుకాణం, ప్రతి కాయకష్టం చేసేవాళ్ళని గౌరవించాలి కానీ ప్రజలను మోసం చేసేవాళ్ళని మాత్రం కాదని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles