Telangana bandh opposing t bill conditions

Telangana bandh opposing T bill conditions, Telangna Bill approved by President, Congress party, T Bill in Rajyasabha, Telangana Praja Front

Telangana bandh opposing T bill conditions

విభజన బిల్లును నిరసిస్తూ నేడు తెలంగాణా బంద్

Posted: 02/11/2014 07:30 AM IST
Telangana bandh opposing t bill conditions

సోమవారం రాష్ట్రపతి దగ్గర్నుంచి రాష్ట్రవిభజన బిల్లు ఆమోదముద్ర వేసుకోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసుకోవటానికి అవసరమైన కసరత్తులలో మునిగిపోతుంటే తెలంగాణా ప్రజా సంఘాలు ఆ బిల్లులోని షరతులను వ్యతిరేకిస్తూ ఈ రోజు తెలంగాణా వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చారు.

వారు వ్యతిరేకించే షరతులు ఇవి-

1. హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధాని చెయ్యటం,
2. ఉమ్మడి గవర్నర్ కి ప్రత్యేక అధికారాలు,
3. పోలవరం ప్రోజెక్ట్ కు జాతీయా హోదా,
4. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపటం,
5. తెలంగాణాకు వచ్చే ఆదాయంలో ఆంధ్రాకు వాటా ఇవ్వటం,
6. విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

మొదలైన షరతులను అంగీకరించబోమంటూ ఈ క్రింది ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి-

1.తెలంగాణా ప్రజా ఫ్రంట్,
2. తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్,
3. తెలంగాణా వుమెన్స్ కలెక్టివ్ రిప్రజెంటేటివ్,
4. తెలంగాణా పీపుల్స్ ఫ్రంట్
5. తెలంగాణా విద్యార్థి ఐకాస

తెలంగాణా ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు ఎం.వేదకుమార్ మీడియా సమావేశంలో ఈ ప్రకటనను చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles