Uganda women complain of illegal trafficking

Uganda women complain of illegal trafficking, Somnath Bharti AAP, Arvind Kejriwal, AAP spokesman Ashutosh, Delhi police connive with trafficking,

Uganda women complain of illegal trafficking, Somnath Bharti AAP

ఢిల్లీ పోలీసుల రహస్య ఒప్పందాలు బట్టబయలు

Posted: 02/04/2014 05:21 PM IST
Uganda women complain of illegal trafficking

ముగ్గురు ఉగాండా మహిళలు వ్యభిచారం సాగించేవారి మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు.   వాళ్ళు తమకి ఉద్యోగం ఇప్పిస్తానని పిలిపించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని వాళ్ళనుంచి రక్షించాలని పోలీసులను అడిగారు. 

మేం చెప్తూ వచ్చింది కూడా ఇదే కదా, ఇందుకే కదా మేము మాల్వ్యా నగర్ లో ఖిడ్కీ ఎక్సెటెన్షన్ లో దాడి చేసింది అన్నారు ఆ యాక్షన్ వలన ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయశాఖా మంత్రి సోమనాథ్ భారతి.  వ్యభిచారం నడుస్తున్నదని తెలిసి దాడికి రమ్మంటే మొరాయించిన పోలీసుల మీద కేంద్ర హోం మంత్రికి ఆరోపణ చేసినా ప్రయోజనం లేకపోవటంతో ఆఆపా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైల్ భవన్ ఎదురుగా రెండు రోజులు దీక్ష చేపట్టటం దరిమిలా ఆ పోలీసులను హోం మంత్రిత్వ శాఖ సస్పెండ్ చెయ్యటం జరిగింది. 

తాజాగా ఫిర్యాదుల అందిన సందర్భంలో మాట్లాడుతూ, మనందరం కలిసి కట్టుగా ఈ చట్టవ్యతిరేక చర్యలను నిలిపివేయాలి, ఆ చర్యలలో భాగస్వాములైన పోలీసుల రహస్య ఒప్పందాలను బట్టబయలు చెయ్యాలని సోమనాథ్ భారతి అన్నారు. 

సోమనాథ్ భారతి మీద అభియోగాలు ఆఆపాను నిర్వీర్యం చెయ్యటానికి చేసిన కుతంత్రాలని, దాన్ని తిప్పికొట్టటానికి ఎవరూ సహకరించలేదని, ఢిల్లీ పోలీసుల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో సహకరిస్తూ వస్తున్నారని, ఢిల్లీ పోలీసు శాఖను ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆఆపా అధికార ప్రతినిధి అశుతోష్ అన్నారు.  అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ సోమనాథ్ భారతిని వేలెత్తి చూపించారు కదా ఇప్పుడేమంటారు?  సోమనాథ్ భారతికి క్షమాపణ చెప్పాల్సివుంటుందని కూడా అన్నారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles