Kiran kumar reddy silent protest at shakti sthal

Kiran Kumar Reddy silent protest at Shakti Sthal, Indira Gandhi samadhi, Indira Gandhi opposed state bifurcation, Chief Minister Kiran Kumar Reddy, President Pranab Mukherjee

Kiran Kumar Reddy silent protest at Shakti Sthal

శక్తి స్థల్ దగ్గర ముఖ్యమంత్రి మౌన దీక్ష

Posted: 02/04/2014 09:57 AM IST
Kiran kumar reddy silent protest at shakti sthal

రేపు బుధవారం మద్యాహ్నం 12.30 కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు భేటీ అవుతారు.  ఆ తర్వాత వాళ్ళంతా ఢిల్లీ లోని ఇందిరా గాంధీ సమాధి శక్తి స్థల్ లో కాసేపు మౌన దీక్షలో కూర్చుంటారు.  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తిరస్కరించిన రాష్ట్ర విభజన బిల్లు మీద రాజ్యాంగ నిపుణుల సలహాలను కూడా ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు.  వైయస్ ఆర్ కాంగ్రెస్, తెదేపా నాయకులను కూడా రాష్ట్ర కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులు కలిసి శాసనసభలో లాగానే పార్లమెంటులో కూడా తెలంగాణా బిల్లును అడ్డుకోవటానికి సహకరించాలని కోరబోతున్నారు.  ఇవీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకుల ఢిల్లీలో ప్రధాన కార్యక్రమాలు. 

అయితే ఈలోపులో ముఖ్యమంత్రిని బుజ్జగించేందుకు, తెలంగాణా బిల్లు విషయంలో సహకారం ఇవ్వమని కోరేందుకు ఢిల్లీ అధిష్టానం ఆయనను ఢిల్లీ రమ్మని కోరింది.  జాతీయ కాంగ్రెస్ పార్టీ తాను ఆశించిన బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకునేందుకు సర్వవిధాలా కృషిచేస్తోంది. 

ఇక, కిరణ్ కుమార్ రెడ్డికి శక్తి స్థల్ కి సంబంధమేమిటి అంటే, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఇందిరా గాంధీ మాట్లాడిన మాటలనే స్పూర్తిగా తీసుకున్నానంటూ ఆయన మొదటి నుంచీ చెప్పుకుంటూవస్తున్నారు.  ఆమె చెప్పిన మాటలనే తిరిగి తను చెప్తున్నానని, అంతే కానీ తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిని కానని, పార్టీకి విశ్వాసపాత్రుడనేనని ఆయన వాదన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles