Tourism development in telangana promises chiranjeevi

tourism development in Telangana promises chiranjeevi, Karimnagar district

tourism development in Telangana promises chiranjeevi

తెలంగాణాలో పర్యాటక అభివృద్ధి- చిరంజీవి

Posted: 02/03/2014 04:15 PM IST
Tourism development in telangana promises chiranjeevi

కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ఆదవారం కరీం నగర్ జిల్లా శివార్లలో మనియార్ డ్యాం దిగువలో ఉన్నరిజర్వాయర్ సమీపంలో గల చారిత్రాత్మక ఎల్గండల్ కోట లో ఛాయా శబ్ద ప్రదర్శన కార్యక్రమానికి ఉద్ఘాటన చేసారు.   ఈ కార్యక్రమానికి 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.4.61 కోట్లను కేటాయిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.  

పర్యటన విషయానికొచ్చేటప్పటికి కేంద్ర మంత్రిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తున్నానని, అందులో తెలంగాణా ప్రాంతం అభివృధ్ది చెందేందుకు ప్రయత్నం చేస్తున్నానని చిరంజీవి చెప్పారు.  2013-14 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన రూ.150 కోట్లలో తెలంగాణాలో రూ.70 కోట్లు కేటాయించారు.  2014-15 కి మరో రూ.73 కోట్లను కేటాయిస్తూ, తెలంగాణాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరచటం ద్వారా తెలంగాణా ప్రాంతానికి ఆదాయపు వనరులను పెంచే పనిని చేపట్టానన్నారాయన.  

అలీసాగర్, దిండి, కోనసీమ భద్రాచలం, రామగిరి కొండలు, ఇంకా ఇతర ప్రాంతాలను అభివృద్ధి చెయ్యటంతో పాటు కరీం నగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా చిరంజీవి తెలియజేసారు.  కరీం నగర్ జిల్లాలో మనకొండూర్ ట్యాంక్ బండ్, నిర్మల్, శనిగరమ్, కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం మొదలైనవాటిని అభివృద్ధి చేస్తామని అన్నారాయన.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి సి.రామచంద్రయ్య, పౌర సరఫరా శాఖామాత్యులు శ్రీధరబాబు, ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.  

ఆ తర్వాత చిరంజీవి సతీసమేతంగా వేములవాడ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయ సందర్శనం చేసిన సందర్భంగా అక్కడ విశేష పూజలను నిర్వహించారు.  ఆ దేవాలయానికి భీమేశ్వర సదనం అనే పేరుతో 100 గదులతో కాటేజ్ ని నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles