Attack on yahoo emails

Attack on yahoo emails Yahoo email accounts hacked, Yahoo Inc, The Sunnyvale Company, Personal information from email hacking

Attack on yahoo emails Yahoo email accounts hacked, Yahoo Inc, The Sunnyvale Company

యాహూ ఇ మెయిల్స్ మీద దాడి

Posted: 01/31/2014 01:57 PM IST
Attack on yahoo emails

యాహూ ఇమెయిల్స్ లోంచి యూజర్ నేమ్ పాస్ వర్డ్ లను తస్కరించటం గమనించిన ఆ సంస్థ సన్నీవేల్ కంపెనీ ఆ విషయాన్ని వెల్లడిచేసింది కానీ అది ఎన్ని అకౌంట్లలో జరిగిందో చెప్పలేకపోయింది.  వినియోగదారుల సంఖ్యాపరంగా జిమెయిల్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న యాహూ మెయిల్ ఖాతాలు ప్రపంచ వ్యాప్తంగా 273 మిలియన్లుండగా ఒక అమెరికాలోనే 81 మిలియన్ల వినియోగదారులున్నారు.  

అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ వేర్ సాయంతో హాకింగ్ చేసి సంగ్రహించిన ఇమెయిల్స్ వివరాల వలన ఆయా వినియోగదారుల వ్యక్తిగతమైన వివరాల చోరీ కూడా జరిగింది.  అయితే ఈ మధ్యనే పంపిన ఇమెల్స్ ద్వారా వాళ్ళ ఖాతాలలోని వివరాల చోరీ జరిగిందని యాహూ ఇన్క్ సంస్థ బ్లాగ్ లో పోస్ట్ చేసి చెప్తోంది.  గత రెండు నెలలో యాహూ మీద ఇది రెండవ దాడి.  ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి చూస్తున్నామని, ఈ విషయాన్ని ఫెడరల్ పోలీసులకు తెలియజేసామని చెప్తోంది యాహూ సంస్థ.  

వ్యక్తిగత వివరాలను సంగ్రహించటం ద్వారా వాళ్ళ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ల వివరాలు బ్యాంక్ ఖాతా వివరాలు తెలిసిపోతాయి.  కానీ ప్రస్తుతానికి హాకింగ్ చేసినవారు స్పామ్ లను పంపించటానికి ఇలా మెయిల్ యూజర్ నేమ్ పాస్ వర్డ్ లను ఉపయోగించబోతున్నారని అంచనా వేస్తున్నారు.  తెలిసినవారి ద్వారా వచ్చిన మెయిలయితే స్పామ్ అని అనుకోకుండా తెరిచే అవకాశం ఉంటుంది.  

కానీ బ్యాంక్ ఖాతాలకు కూడా ముప్పు ఉండటాన్ని కొట్టిపారెయ్యలేము.  చాలా మంది తమ పాస్ వర్డ్ ని రిసెట్ చేసుకునే అవకాశం ఉంది.  అలా రిసెట్ చేసుకునేందుకు హ్యాకర్లు ఇ మెయిల్ ద్వారా పాస్ వర్డ్ మార్చుకోమని వాళ్ళకి రిమైండర్ పంపించే అవకాశం కూడా ఉంది.  

ఇమెయిల్స్ హ్యాకింగ్ చేసినవారు తెలివిగా తమ సిస్టమ్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ డేటా బేస్ నుంచి హ్యాకింగ్ చేసారని యాహూ సంస్థ తెలియజేస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles