Center making amendments in t bill

Center making amendments in T Bill, AP State reorganization bill, Telangana bill, AP State bifurcation, CM resolution on T Bill

Center making amendments in AP State Reorganization Bill 2013 to please Seemandhra people and BJP

బిల్లులో సవరణలు చేస్తున్న కేంద్రం

Posted: 01/30/2014 09:49 AM IST
Center making amendments in t bill

రాష్ట్ర విభజన బిల్లు విషయంలో పీటముడి పడి ఒక పక్క రాష్ట్రంలో నాయకులంతా మల్లగుల్లాలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం బిల్లు ఆమోదానికి సర్వ సన్నాహాలు చేస్తోంది.  పరిస్థితి చెయి జారిపోతోందని, తమకు రక్షణ కల్పించమని సీమాంధ్ర నేతలు కోరటం విశేషం.   ఈ రోజు బిల్లుని తిరిగి పంపటం మీద ఓటింగ్ కి వస్తుండటంతో ఘర్షణలు, భౌతిక దాడులు చోటుచేసుకుంటాయనే భయంతో పోలీసులు అసెంబ్లీ ఆవరణలో భారీగా మోహరించారు.

ఈరోజుతో రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగియటంతో మరో మూడు వారాలు గడువు కావాలని కోరారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.  గడువు పొడిగించ వద్దని తెలంగాణా నాయకులు కోరుతున్నారు.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా గడువు పెంపుకి ప్రతికూలంగానే వుంది.  ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 7 న బిల్లు మీద కేబినెట్ ఆమోదం, పార్లమెంట్ లో ఫిబ్రవరి 11 న బిల్లుని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ కార్యప్రణాళికను నిర్ణయించింది. 

అయితే అందుకు వేదికను సిద్ధం చెయ్యటం కోసం కాంగ్రెస్ పెద్దలు విభజన బిల్లు మీద భాజపా మద్దతు తీసుకోవటం కోసం వ్యూహాలు పన్నుతున్నారు.  అలాగే సీమాంధ్ర ప్రజల కోపాగ్నిని చల్లబరచటం కోసం బిల్లులో ఆరు సవరణలు కూడా చెయ్యనున్నారు. 

రాష్ట్ర విభజన బిల్లులో సవరణలు ఇవి-

1. బిల్లు ఆమోదించిన 45 రోజులలో కొత్త రాజధాని నిర్ణయం, మొదటి విడతగా 7000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వటం.  దానితో పాటు అసలు కొత్త రాజధానికి నిధులు ఎంత కావలసివస్తుంది, దాన్ని కేంద్రం ఎలా సమకూరుస్తుంది అన్నదాంట్లో మంత్రుల బృందం స్పష్టత ఇవ్వటం జరుగుతుంది. 
2. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, ఐఐటి, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయం లాంటి అంశాల మీద స్పష్టత ఇవ్వనున్నారు. 
3. పోలవరం వలన ఏర్పడే ముంపు ప్రాంతాలను సీమాంధ్రలోనే కలుపుతారు.  దానితోపాటు సీమాంధ్రకు అవసరమైన నీటిని కేటాయించే విషయంలో కూడా స్పష్టత ఇవ్వనున్నారు.

బిల్లు మీద చర్చకు మాత్రం గడువు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles