Comedian venu madhav visits state assembly

Venu Madhav Visits assembly, comedian actor venu madhav, TDP leaders, Chandrababu Naidu, NTR

Comedian actor of Tollywood Venu Madhav paid a visit to Andhra Pradesh state assembly. On Wednesday morning.

అసెంబ్లీకి కమేడియన్ వేణు మాధవ్ ..

Posted: 01/29/2014 09:09 PM IST
Comedian venu madhav visits state assembly

తెలుగు సినిమా కమేడియన్ అయిన వేణు మాధవ్ ఉన్నట్లుండి అసెంబ్లీలో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం చేతిలో అంతంత మాత్రంగానే సినిమాలు ఉండటంతో ఖాళీ టైం దొరకడంతో అసెంబ్లీకి వచ్చి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశాడు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ను పలకరించగా.... గతంలో తాను టిడిఎల్పీలో ఉద్యోగిగా పని చేశానని, ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో నేతలను కలిసుకునేందుకు వచ్చానని చెప్పారు. అతను చదువుకునే రోజుల్లో ఓ సందర్భంలో టాకింగ్ డాల్‌లో ప్రోగ్రామ్ చేశాడు.

దీనిని చూసిన నాటి కోదాడ శాసన సభ్యులు చందర రావు అతడిని భువనగిరిలో తెలుగుదేశం పార్టీ సమావేశానికి తీసుకు వెళ్లారు. అలా స్వర్గీయ నందమూరి తాకర రామారావు మహానాడులో వేణు మాధవ్ ప్రదర్శన ఇచ్చారు. అది ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. మీ సేవలు మాకు అవసరం బ్రదర్ అంటూ వేణు మాధవ్‌ను హిమయత్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేర్చుకున్నారు. గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురి నేతల్ని కలిసి సరదాగా మాట్లాడారు. అయితే మీడియా మాత్రం వేణు మాధవ్ టీడీపీలో చేరే ప్రయత్నాలు ప్రారంభించి అందులో భాగంగానే బాబును కలవడానికి వచ్చాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles