Divorced wife demands kidney back

divorced wife demands kidney back, Andy Lamb, Samantha Lamb demands kidney back, donated kidney demanded back

divorced wife demands kidney back, Samantha Lamb demands kidney back

నా కిడ్నీ నాకిచ్చెయ్- విడాకుల భార్య మంకుపట్టు

Posted: 01/28/2014 12:22 PM IST
Divorced wife demands kidney back

వైవాహిక జీవితంలో ఉన్నంతకాలం భార్యాభర్తలిద్దరూ పరస్పర ప్రేమాభిమానాలను పంచుకుంటూ ఉంటారు.  విడిపోయే సమయం వచ్చేసరికి ఆ ప్రేమ కాస్తా ద్వేషంలోకి మారుతుంది.  విడాకులు తీసుకునేటప్పుడు భారతదేశంలో అయితే అభద్రతా భావమే కావొచ్చు లేదా నా జీవితంలో కొంత భాగం వృధా అయింది, అది ఇక తిరిగి రాదు అనే భావనే కావొచ్చు కానీ మహిళల తరఫు నుంచి వీలయినంత ఎక్కువగా భర్తల నుంచి విడాకులతో పాటు కోరుతుంటారు.  

ఇది విదేశాలలో కూడా తక్కువేం కాదు అని లండన్ వాసి సమంతా లాంబ్ చేస్తున్న డిమాండ్ తో తెలుస్తోంది.  41 సంవత్సరాల సమంతా లాంబ్ 2009 తన భర్తకు కిడ్నీ దానం చేసింది.  కిడ్నీ సమస్యతో కేవలం డయాలిసిస్ మీదనే బ్రతుకు సాగిస్తున్న ఆమె భర్త ఆండీ లాంబ్ కి ఆమె ఒక కిడ్నీ దానం చెయ్యటంతో అతను సాధారణ జీవితాన్ని కొనసాగించగలిగాడు.  అప్పట్లో వీరి ప్రేమానురాగాలు, త్యాగాతిశయాల గురించి బిబిసిలో ఇంటర్వూ కూడా ఘనంగా వచ్చింది.  

కానీ ఇద్దరూ విడాకులకు వచ్చేసరికి పరిస్తితంతా మారిపోయింది.  ప్రేమ స్థానంలో వైషమ్యం చిగురించింది.  2012 లో ఆండీ ఆమెను వదిలేసాడు.  కారణం తన స్నేహితురాలితో సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య గొడవ.  అదేమీ లేదంటాడు ఆండీ.  అయినా నమ్మకం లేదంటూ సమంతా తన భర్త పూర్వ సంబంధంలో పిల్లలు కూడా ఉన్నారని, మళ్ళీ ఆమెకే చేరువౌదామని చూస్తున్నాడంటూ ఆరోపించారు.  

దానం చెయ్యటమంటే నిజానికి దాని మీద అధికారాన్ని వదులుకోవటమే కానీ పట్టుదల వచ్చినప్పుడదంతా పోతుంది.  నా వస్తువులన్నీ నాకిచ్చేయ్ అన్నట్లుగా నా కిడ్నీ తిరిగి నాకిచ్చేయమంటోందా విడిపోయన భార్య.  మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ కిడ్నీని తీసేస్తే అంతకంటే యోగ్యులకు ఆ కిడ్నీని ఇస్తానంటోందామె.  

నిజానికి వాళ్ళిద్దరూ 2004 ఆంబులెన్స్ డ్రైవర్లుగా పనిచేస్తున్నప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించటం, తర్వాత డేటింగ్ లు, కొంత కాలం కలిసివున్న తర్వాత 2007 లో వివాహబంధంలో ఒకరికొకరు ముడివేసుకోవటం జరిగింది.  అంత ప్రేమ ఒక్కసారిగా తరిగిపోవటమే కాకుండా దాని స్థానంలో శత్రుత్వం చోటుచేసుకోవటం జరిగింది.  సమంత చెప్పేదంతా తప్పు.  ఆమె స్నేహితురాలితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు.  కేవలం ఆమె పెంపుడు కుక్క విషయంలో ఆమెకు నేను సాయపడ్డానంతే అంటాడు ఆండ్రీ లాంబ్.  

కిడ్నీ అంటే ఇంకా అక్కడే ఉంది కాబట్టి ఆమె అడుగుతోంది కానీ, పంచుకున్న ప్రేమలు తిరిగి తీసుకోగలరా?  తరిగిపోయిన వయసుని దక్కించుకోగలరా?  ప్రేమ కలగటం జరిగినట్లే తగ్గిపోవటం కూడా జరగవచ్చు.  అలాంటప్పుడు కూడా కలిసి వుండాలి అని చెప్పటం సమంజసం కాదు కాబట్టి ఇప్పుడు మన దేశంలో కూడా విడాకులు తీసుకునే సందర్బాలు ఎక్కువయ్యాయి.  కానీ ప్రేమ స్థానంలో విషమయం కాకూడదు!  ప్రేమ లేకపోయినా పరవాలేదు కానీ మనుషుల మధ్య వైషమ్యాలు తలెత్తకూడదని ఒప్పుకుంటారా?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles