Vallabhaneni vamsi compliant against ig sitaramanjaneyulu

Vallabhaneni Vamsi compliant, Vamsi compliant against Sitaramanjaneyulu, Greyhounds IG Sitaramanjaneyulu, Vallbhaneni Vamsi comliant to DGP

Vallabhaneni Vamsi compliant against IG Sitaramanjaneyulu

గ్రైహౌండ్స్ ఐజీవలన ప్రాణాపాయం- వల్లభనేని వంశీ ఫిర్యాదు

Posted: 01/21/2014 11:02 AM IST
Vallabhaneni vamsi compliant against ig sitaramanjaneyulu

గ్రైహౌండ్స్ ఐజి సీతారామాంజనేయుల వలన తన ప్రాణానికే ముప్పుందని వల్లభనేని వంశీ డిజిపి కి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ తనకు భద్రత కల్పించవలసిందిగా కూడా అభ్యర్థన చేసారు. 

సీతారామాంజనేయులు గతంలో విజయవాడలో పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న సమయంలో నగరంలో మహిళలను వేధిస్తున్న విషయాలను బయటపెట్టిన తన మీద కత్తిగట్టి ఇప్పుడు గ్రేహౌండ్స్ లో ఐజి గా పని చేస్తున్న అధికారంతో తనను నక్సలైట్లతో చంపించేందుకు ఆయన వ్యూహాలు పన్నుతున్నారని వంశీ అభియోగం. 

విజయవాడ పోలీస్ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చెయ్యటమే కాకుండా ఈ విషయంలో వివరణ నివ్వటం కోసం ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంటుని కూడా కోరిన వంశీ, సీతారామాంజనేయులు కొద్ది రోజులుగా నక్సల్ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారని, అందుకు లక్ష్యం తన ప్రాణాలను హరించటమేనని వంశీ వాపోయారు.

ఫిర్యాదుని గ్రహించిన డిజిపి ఈ విషయం మీద పూర్వాపరాలను ఆరాతీస్తున్నారు. 

2010 లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పదవీ స్వీకారం చేసిన సీతారామాంజనేయులు విధుల్లోకి చేరుతూనే విజయవాడ రౌడీషీటర్లందరినీ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటంతో ఆయన మీద అందరికీ నిజాయితీగల ఆఫీసరన్న అభిప్రాయం కలిగింది.  కానీ త్వరలోనే జనవరి 2011లో ఒక ప్రైవేట్ టివి ఛానెల్ చేసిన దర్యాప్తులో మహిళలను వేధిస్తున్న సీతారామాంజనేయులు అడ్డంగా దొరికిపోయి ప్రజలలో కలిగిన సదభిప్రాయాన్ని పోగొట్టుకున్నారు.  

ఎంతోమంది మహిళలకు ఫోన్లు ఎస్ఎమ్ఎస్ లు పంపించి వేధించిన విషయం బయటపడటంతో మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సీతారామాంజనేయులుకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసాయి.   

అయితే అదంతా తెలుగు దేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ వ్యూహరచనని, తను కమిషనర్ గా వచ్చిన తర్వాత వంశీ ఆటలు కట్టించి అతను చేసే చట్టవ్యతిరేక చర్యలకు చెక్ పెట్టటం వలనే తనని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని సీతారామాంజనేయులు ఆరోపణలను తిప్పికొట్టారు.  అందుకు ప్రతిగా కమిషనర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, ప్రతిరోజూ సెటిల్ మెంట్లతోనే కాలం గడుపుతున్నారంటూ వల్లభనేని వంశీ ఆరోపించారు.  

దీనిమీద సమగ్రమైన దర్యాప్తు చెయ్యమని అప్పట్లో ఆదేశించిన ముఖ్యమంత్రి దోషులను శిక్షించకుండా వదిలిపెట్టబోము అని ప్రకటించారు.  సీతారామాంజనేయులు ఎవరెవరికి ఎటువంటి మెసేజ్ లు పంపించారు అన్న దానిమీద పూర్తి వివరణ నివ్వటంతో డిజిపి సీతారామాంజనేయులును తన ఆఫీస్ కి పిలిపించి కమిషనర్ పదవి నుంచి తొలగించటం కూడా జరిగింది.  టివి ఛానెల్ లో మాట్లాడుతూ సీతారామాంజనేయులు, ఆ మెసేజ్ లను తానే పంపించానని, అయితే అది కేవలం వల్లభనేని వంశీ రాజకీయ వ్యూహానికి ప్రతిగానే చేసానని చెప్పుకొచ్చారు.  అంతా వంశీ పన్నిన వల అని, అయితే తాను అందులో పడలేదని కేవలం వలలో పడుతున్నట్లుగా నటించానని సీతారామాంజనేయులు చెప్తూ, తన గురించి తన వ్యక్తిత్వం గురించి తన భార్యకు బాగా తెలుసని చెప్పటం విశేషం.  మరి అలా వంశీ వ్యూహానికి చేసిన ప్రతివ్యూహం సీతారామాంజనేయులు తన పై అధికారులకు చెప్పే చేసారా అని అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేస్తూ, చెప్పవలసినవాళ్ళకి చెప్పాల్సినంత చెప్పానన్నారు.

సీతారామాంజనేయులు పంపించిన మెసేజ్ లు చేసిన ఫోన్ కాల్స్ లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల కూతుళ్ళు, ఒక లేడీ డాక్టర్ కూడా ఉన్నారని దర్యాప్తు చేసిన టివి ఛానెల్ బయటపెట్టింది.  వాళ్ళు ఏ రంగు చీర కట్టుకుంటే బావుంటుంది, ఎలా అలంకరించుకుంటే బాగా కనిపిస్తారు, ఇంకా సన్నిహితంగా ఉంటే ఇంకా బావుంటుంది అన్న సంక్షిప్త సందేశాలను పంపించినట్లుగా ఆ ఛానెల్ చెప్పింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles