Venkayya statements on telangana

bjp stands,telangana issue, venkayya naidu, delhi, bjp meetings, venkayya statement on telangana, rajnath singh statement on telangana

venkayya statements on telangana

తెలంగాణపై తేల్చనున్న వెంకయ్య

Posted: 01/20/2014 08:08 AM IST
Venkayya statements on telangana

రాష్ర్ట విభజనప్రక్రియ సమంజసంగా లేదంటూ గతంలో చెప్పిన బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు  సోమవారం  ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జరిగే కార్య్రకమంలో తాజాగా తన వైఖరి ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా ఇచ్చేది మేనే నంటూ ఎప్పటి నుండో చెప్పుకొస్తున్న బిజెపి ఈ సారి ఎటుంటి వ్యాఖ్యానలు చేస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ సందిగ్ధావస్థలో పడిందంటూ ఊహాగానాలు వస్తున్న నేపధ్యంలో వెంకయ్య నాయుడు ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఇదే విషమమై బాజాపా జాతీయ కార్యవర్గ సమావేశంలో  పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తాము  తెలంగాణకు సుముఖంగా ఉన్నట్లు చెప్పిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బిజెపి కూడు తెలంగాణపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఈ విషయమై ఏమి చెబుతారోనని, ఈ సమస్యకు పరిష్కారం ఏవిధంగా సూచిస్తారోనని అందరూ  ఆసక్తి కనబరుస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles