Telangana effect on rajaya sabha elections

telangana issue, rajya sabha elections, t bill, cm kiran kumar reddy new party, harikrishna resigned rajya sabha, t subbirami reddy

telangana effect on rajya sbha elections

రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ చిచ్చు

Posted: 01/16/2014 08:52 AM IST
Telangana effect on rajaya sabha elections

రాష్ర్టంలో తెలగాణ అంశం ఎటూ తేలకా ఇంకా ఊగిసలాట గానే ఉన్న నేపధ్యంలో నెలరోజుల్లో సార్వ్రతిక ఎన్నికలను నిర్వహించేందు  కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. దీనికి తోడు దేశ వ్యాప్తంగా 16 రాష్ర్టాలలోని 55 రాజ్య సభ స్థానాలలో ఎన్నికల నిర్వహణకు  నోటిఫికేషన్ జారీ చేసింది.  విభజన నేపధ్యంలో రాష్ర్టంలో  కోనసాగుతున్న అనిశ్చితి  రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.

విభజన నిర్ణయంతో  రాజకీయ సమీకరణలు మారుతున్న తరుణంలో  ఎన్నికలు అటు కాంగ్రెసకు, ఇటు ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డికి పెను సవాల్ గా మారాయి. దీంతో రాష్ర్టంలో ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం  అవుతాయా కాదా అన్నది చర్చనీయాంశంగా  మారంది.     రాజ్య సభకు ఎవరినైనా నామినేట్ చేయాలంటే 10 మంది సభ్యులు వారిని బలపరచాలి.

ప్రస్తుతం అసెంబ్లీలోని  మొత్తం 294 మంది సభ్యుల్లో 15మంది అనర్హత వేటుకు గురయ్యారు.  పార్టీ ఫిరాయించేవారు  ఎవరికి మద్దతు పలుకుతారు ? ఇంతకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెడతారా    అనే దానిపై రాజ్యసభ నామినేషన్ తేలుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో 55మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియ నుంది.    

రాజ్యసభకు ఇటీవలే నందమూరి  హరిక్రిష్ణ రాజీనామా చేయగా, టి సుబ్బిరామిరెడ్డి, నంది ఎల్లయ్య, మహ్మద్ అలీఖాన్, కెవిపి తదితరుల పదవీ కాలం ముగియనుంది.  ఇదిలా ఉండగా ఈ నెల 17 నుండి 23 వరకూ అసెంబ్లీ  చివరి విడత సమావేశాలు జరగనున్నాయి.  ఈ నేపధ్యంలో ఇంతలోనే కిరణ్ పార్టీ పెట్టే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.     దీంతో కిరణ్ ఎవరిని బలపరిచి రాజ్యసభకు పంపుతారన్నది సందిగ్థావస్థలో పడింది.    

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles