Elections for 55 rajya sabha seats february 7

Rajya Sabha, Rajya Sabha elections, Maharashtra, Election Commission, General elections

Biennial elections for 55 Rajya Sabha seats, including seven from Maharashtra, will be held Feb 7, the Election Commission announced Monday.

రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది

Posted: 01/14/2014 10:24 AM IST
Elections for 55 rajya sabha seats february 7

శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు ముందు మరో ఎన్నికల రగడ మొదలైంది. అవే రాజ్యసభ ఎన్నికలు. రెండేళ్ళకోసారి జరిగే రాజ్యసభ ఎన్నికలు వచ్చేనెల ఏడవ తేదీన ఈ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం పదహారు రాష్ట్రాలకు చెందిన 55 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్లో ముగియనుండటంతో ఈనెల 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

నామినేషన్ కు చివరి తేదీ జనవరి 28వ కాగా, నామినేషన్ల ఉపసంహరణకు 31వ తేదీని గడువుగా పెట్టారు. ఈ నెల 29వ నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామి రెడ్డి, నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్ , టి. రత్నాబాయి, కె.వి.పి. రామచంద్రారావుల పదవి కాలం ఏప్రిల్ లో ముగుస్తుండగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

2014 ఎన్నికలకు టైమ్‌ దగ్గరపడిపోవడంతో, ఆయా పార్టీల్లోని అసంతృప్తులు తమ పార్టీ బరిలోకి దింపిన అభ్యర్థులకు కాకుండా, తమకు నచ్చినవారికి ఓటేసే అవకాశాలెక్కువ. అదే ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ఎవరికి ఈ పదవులు కట్టబెడతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles