Delhi helpline can be misused

Delhi Helpline can be misused, Arvind Kejriwal, AAP, Delhi Chief Minister, Helpline misuse

Delhi Helpline can be misused

హెల్ప్ లైన్ మంచికీ చెడుకీ ఉపయోగపడుతుంది !

Posted: 01/10/2014 03:05 PM IST
Delhi helpline can be misused

శ్రీరాముడు రాజ్యంలో ఆపత్కాలంలో కొట్టటానికి పెట్టిన గంట వ్యర్థంగా పడివుండేదట.  మాకు ఇది తక్కువ, ఇది కావాలి, ఇక్కడ అన్యాయం జరిగింది అని ఫిర్యాదులు చేసేవారే లేరని చెప్తారు.   కానీ ఈ కాలంలో.  నీ కేం కావాలి, ఏం తక్కువుంది, నీకేం అన్యాయం జరిగింది అని అడిగితే ఒక్కొక్కరి జాబితా చేంతాడంత అవుతాయి కాబట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రారంభించిన హెల్ప్ లైన్ కి మంచి స్పందన వచ్చింది.  వేలాది కాల్స్ వచ్చాయి.  సంతోషం!  చేతినిండా పని! 

అయితే ఆ ఫిర్యాదులను ఆయన ఏ విధంగా పరిశీలిస్తారు, ఏమి చర్యలు తీసుకుంటారన్నదానిలో స్పష్టత లేదు.  వ్యక్తిగతంగా ఎవరిమీదైనా కక్ష తీర్చుకోవటానికి ఒక్క కాల్ చాలు!  ఎవరిమీదైనా ఎలాంటి అభియోగాన్నైనా మోపవచ్చు!  ఒకవేళ నిజంగా పోలీసులు పోయి విచారణ మొదలుపెట్టి నిందితుడిని ఏమీ చెయ్యనక్కరలేదు ఒట్టిగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా చాలు ఫిర్యాదు దారుడికి మహదానందం కలుగుతుంది. 

హెల్ప్ లైన్ ల మాటెత్తి ఎవరినైనా బ్లాక్ మెయిల్ చెయ్యటానికి కూడా ఆస్కారం ఉంది.  నిజంగా జరిగిందో లేదో తర్వాత తేలుతుంది, అది తర్వాత సంగతి కానీ ముందైతే పోలీసుల వేధింపులకైతే గురవుతారు కదా.  తప్పు సమాచారం ఇచ్చినవారిమీద శిక్షలుంటాయా అన్నది కూడా కేజ్రీవాల్ చెప్పవలసివుంది.  ప్రస్తుతం అందరూ సెల్ ఫోన్లే వాడుతున్నారు కాబట్టి కాల్స్ ని ట్రేస్ చెయ్యవచ్చు కానీ జరిగిన వేధింపుల విషయంలో వాళ్ళకి న్యాయమైతే జరగదు కదా.  మరి దానికి ప్రతిగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. 

అయితే, ప్రతి మంచి పని చేపట్టినపుడు బాలారిష్టలు, కొన్ని అవాంతరాలైతే ఉంటాయన్నది నిజమే కానీ మొదలైతే పెట్టాలి కదా!  అందువలన అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన హెల్ప్ లైన్ విధానమైతే మంచిదే!  కాకపోతే అల్లరి చేద్దాం ఆటపట్టిద్దామనుకునేవాళ్ళకి కూడా అది అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకోవలసివుంది. 

ముఖ్యంగా తప్పు చేసేవాళ్ళైతే దీనితో జంకటం మొదలుపెడతారు.  అంతవరకైతే ఖాయం!  దండన అనేది ఉంటుంది అని తెలిసినప్పుడు తప్పు చేసే ఆలోచన పోయి వెంటనే మంచివారుగా మారకపోయినా కనీసం ఆ దండనకు భయపడైనా దుండగాలకు పాల్పడకుండా ఉంటారు.  కొన్నాళ్ళకు అదే రివాజుగా మారిపోతుంది.  క్రమంగా ప్రజలలో మార్పు వస్తుందన్నది మాత్రం నిజం.

హెల్ప్ లైన్ మొదలుపెట్టిన ఏడు గంటల కాలంలో వచ్చిన కాల్స్ 3904.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles