Attack on girl with hot water

attack on girl with hot water, attack for unfriend on facebook, face book unfriend causes attack, face of unfriends burnt

attack on girl with hot water

వేడి నీళ్ళతో బాలిక మీద దాడి

Posted: 01/03/2014 02:07 PM IST
Attack on girl with hot water

బీహార్ రాష్ట్రంలో ముజప్ఫర్ నగర్ లో జరిగిన సంఘటనిది.  పదవి తరగతి చదువుతున్న యుధిష్టిర్ యాదవ్ ఏడవ తరగతి చదువుతున్న అమ్మాయి ముఖం మీద వేడినీళ్ళు పోసాడు.  కారణం ఫేస్ బుక్ ఆ అమ్మాయి అతనితో ఫ్రెండ్ షిఫ్ ని రద్దు చెయ్యటం. 

ఫేస్ బుక్ లో తనని అన్ ఫ్రెండ్ చేసిందన్న కోపంతో బుధవారం నాడు ముజప్ఫర్ పూర్ లోని గన్నిపూర్ మొహల్లా ఖాజీ మొహమ్మద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాదవ్ ఆ బాలిక ఇంటికి పోయి మరీ చేసిన ఆ దాడి వలన ఆ అమ్మాయికి ముఖం మీద కుడివైపు కాలిపోయింది.  ప్రాణ హానైతే లేదు కానీ ఆమె ముఖం మీద జీవితాంతం మోయవలసి వచ్చిన మచ్చ ఏర్పడింది. 

ఆ అమ్మాయి తండ్రి దగ్గర ప్రైవేటు క్లాసులకు పోతూవున్న యాదవ్ ఫేస్ బుక్ సాయంతో ఆమెతో సంభాషణ జరుపుతుండేవాడు.  కానీ ఆ విషయం ఇంకా ముందుకు పోకుండా ఉండటం కోసం ఫేస్ బుక్ లో అతన్ని అన్ ఫ్రెండ్ చెయ్యటంతో వచ్చిన కోపావేశంతో దాడిచేసి పారిపోయిన యాదవ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.

ప్రేమ, స్నేహం గురించి తెలిసీ తెలియని వయసు వాళ్ళది.  తన స్నేహం కాదన్నదన్న అవమానం ఆ అబ్బాయికి కోపం లోకి మారిందంటే అందుకు కారణం ఏమిటి?  విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానమే సమాజానికి శాపమౌతోందా లేకపోతే సినిమాలు, టివి సీరియల్స్ లలో చూస్తున్న ప్రేమ వ్యవహారాలు పిల్లల బుర్రలను పాడుచేస్తున్నాయా?

దేశంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలను చిన్నవిగా చూడకుండా వాటిని కూడా సమస్యలుగా తీసుకుని జాతీయ స్థాయిలో పరిష్కరించవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది!  కేవలం రాజకీయాలు అందులో ఎత్తుకు పై ఎత్తుల మీదనే దృష్టంతా పెట్టటం కాకుండా సమాజాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత కూడా దేశ రాజకీయ నాయకుల మీద ఉంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles