Terrorists target new year eve firework celebrations

Intelligence Bureau, New Year celebrations, Indian Mujahideen

terrorists target New Year Eve firework celebrations

కొత్త సంవత్సర వేడుకల పై ఉగ్ర కన్ను

Posted: 12/31/2013 12:45 PM IST
Terrorists target new year eve firework celebrations

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. యువత ఉత్సాహంగా ఈ వేడుకల్ని జరుపుకోవడానికి సిద్దం అవుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు స్టార్ హోటళ్ళు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, రిసార్ట్ లు సిద్దం అయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా న్యూ ఇయర్ వేడుకల్లో అందరు మునిగి తేలుతుంటే ఉగ్రవాదులు కన్నుగప్పి పంజా విసరవచ్చనే హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో.

వేడుకల నేపథ్యంలో అందరు అప్రమత్తంగా ఉండాలని, ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ పలు చోట్ల వింధ్యంసానికి పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో నగర పోలీసు బాస్ లు అధికారులతో సమావేశం నిర్వహించి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు రాత్రి నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

బార్లు, పబ్బులల్లో రాత్రి 12 వరకు, హోటల్స్, రిసార్ట్స్‌లలో రాత్రి 1 గంట వరకు కొత్త సంవత్సర వేడుకలకు అనుమతించారు. రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని అన్ని  ఫ్లైఓవర్లు మూసివేస్తున్నారు. నగరంలోకి భారీ వాహనాలను అనుమితించేది లేదని పోలీసులు చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్ని శ్రుతిమించకుండా  నిర్వహించుకోవాలని జంటనగరాల ప్రజలను కోరారు. సో... బి కేర్ ఫుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles