25 30 ap cong mlas join other parties botsa

Botsa Satyanarayana , Congress,Botsa Satyanarayana,congressmlas, Congress MLAs jump,PCC, AP Cong legislators, Telugu Desam Party, YSR Congress

Pradesh, state party president Botsa Satyanarayana on Friday said about 30 were ready to cross-over to other parties.

30 ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి సిద్దం : బొత్స

Posted: 12/27/2013 04:14 PM IST
25 30 ap cong mlas join other parties botsa

ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలకు చాలా మంది జంప్ జిలానీ అవుతారని, అందులో మంత్రులు, ఎమ్మెల్మేలు కూడా ఉన్నారని ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తల పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...

కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు ఇరవై అయిదు నుండి ముప్పై మంది ఎమ్మెల్యేలు పార్టీనీ విడేందుకు సిద్దంగా ఉన్నారని, అందులో కొంత మంది మంత్రులు కూడా ఉన్నారని, అలా గోడదూకే వారి లిస్టు తనవద్ద ఉన్నదని, ఇన్ని రోజులు పార్టీ లో పదవులు, హోదా అనుభవించిన వారు ఎన్నికల ముందు వేరే పార్టీలోకి వెళ్ళడానికి సిద్దం అవుతున్న వారి పై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనల కింద జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ ఇచ్చామని, ఒకవేళ అది అందలేదంటే మళ్ళీ ఇస్తామని, ఇలా ఊసరవెళ్లి రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక బుద్ది చెబుతారని అన్నారు. పార్టీ నుండి గోడ దూకే ఎంపీల సంగతి ఏఐసీసీ చూసుకుంటుందన్నారు.

తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బొత్స అన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేల లిస్టు బొత్స దగ్గర ఇప్పటికే ఉన్నదంటే... ఆయనకు ముందే ఎవరెవరు గోడ దూకుతారో తెలుసన్న మాట పార్టీ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles